BREAKING
రేపు సాయంత్రానికి వినాయక నిమజ్జనం పూర్తి మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు

నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్..

Select Suryaa Now
నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్..

 

 సూర్య ఇందూరు.
 

 విద్యార్థులు, యువతకు అవసరమైన ఆధునిక సౌకర్యాలతో నూతన గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ పట్టణంలో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో మహేశ్కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడారు.ప్రస్తుత శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.నాణ్యమైన పుస్తకాలతో పాటు డిజిటల్ వనరులు, పోటీ పరీక్షలు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు.పుస్తక పఠనం జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు.సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రపంచం అరచేతిలోకి వచ్చిందన్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన విషయాలు ప్రస్తుత పరిస్థితుల్లో మరింత ప్రాసంగికంగా కనిపిస్తున్నాయని తెలిపారు.సోషల్ మీడియాను యువత విచక్షణతో వినియోగించాలని సూచించారు. కేవలం వినోదానికే పరిమితం కాకుండా విద్య, విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధికి ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.కళాశాల విద్యార్థులు గ్రంథాలయ సభ్యత్వం తీసుకుని పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలన్నారు.యువతలో గ్రంథాలయాల ప్రాధాన్యంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.నూతన గ్రంథాలయం నగర విద్యార్థులు, యువతతో పాటు ప్రజలందరికీ విజ్ఞాన కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో మేయర్ ఉమారాణి,డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాజారెడ్డి,వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రంథాలయ నిర్వాహకులు పాల్గొన్నారు.