మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత
అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
సూర్య కరీంనగర్
మాధకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, డ్రగ్స్ రహిత జిల్లాగా కరీంనగర్ ను తీర్చిదిద్దాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం జిల్లాస్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది.
ఈ సమావేశానికి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డీసీపీ వెంకటరమణ వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలలు, విద్యాసంస్థల్లో విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మాధకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో డ్రగ్స్ వాడకంపై ఉక్కు పాదం మోపాలని సూచించారు.
అడిషనల్ డీసీపీ వెంకటరమణ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదన్నారు. తరచుగా హాస్టల్లో, బస్టాండ్ ల వద్ద తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు.
డ్రగ్స్ మూలాలను సమూలంగా అంతం చేస్తామని, డ్రగ్స్ వినియోగం, అమ్మకం తదితర సమాచారాన్ని తమకు తెలియజేయాలని కోరారు.
అనంతరం తల్లిదండ్రులు వయోవృద్ధుల, పోషణ సంరక్షణ చట్టాలకు సంబంధించిన పోస్టర్, బుక్ లేట్ ఆవిష్కరించారు.
సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ, జిల్లా వైద్యాధికారి రాజగోపాల్, ఎక్సైజ్ పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.