telanagana
ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి.
- ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సృజన్ కుమార్.
సూర్య, నాగిరెడ్డిపేట
మండల ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని నాగిరెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ సృజన్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల ప్రత్యేక అధికారి, ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్ ఆధ్వర్యంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన విషయాలపై చర్చించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి సురేందర్ సూచించారు. త్వరలో ఆసుపత్రి సిబ్బంది, మండలంలోని సర్పంచ్‌లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలపై చర్చించాలని సురేందర్ సూచించారు. త్వరలో సమావేశం నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, గోపాల్‌పేట సర్పంచ్ వంశీకృష్ణగౌడ్, నాగిరెడ్డిపేట సర్పంచ్ మన్నే వెంకటి, గోలిలింగాల సర్పంచ్ రోజా, మండల వైద్యాధికారి డాక్టర్ సృజన్‌కుమార్, సూపర్‌వైజర్లు సునంద, సుభాషిణి, అనిల్ డేవిడ్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.