telanagana
మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
- అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ అదిలాబాద్ జిల్లాలకు చెందిన అధికారులతో కామారెడ్డి వేదికగా ఈనెల 28న నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అధికారులతో ఆయా జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సీతక్క కామారెడ్డి వేదికగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. ఈ సమీక్షా సమావేశానికి అవసరమైన ఇతర ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సమీక్షా సమావేశానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలన్నారు. శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటి పురోగతి, పెండింగ్ అంశాలు, సాధించిన లక్ష్యాలు తదితర వివరాలతో సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రూమ్ నంబర్ 25కు మార్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జెడ్పీ సీఈఓ చందర్, డీఆర్‌డీఓ దామోదర్ రెడ్డి, డీఆర్ఓ పాండు, ఏఓ మసూద్ హైమద్, పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.