BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

Select Suryaa Now
విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

 

డాక్టర్ ఎన్ ఎం కె తిరుమల ప్రసాద్ వెల్లడి

అనారోగ్యంతో ఉన్న పిల్లలకు మాత్రలు వేయకూడదు..డాక్టర్ తిరుమలప్రసాద్

గరుగుబిల్లి, సెప్టెంబర్ 25, మేజర్ న్యూస్:జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల లు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బెండజోల్  మాత్రల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్ తెలిపారు.మండల పరిధిలోని గొట్టివలస గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శుక్రవారం వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్ విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేసి కార్యక్రమంను ప్రారంభిం చారు.ఈసందర్భంగా వైద్యాధికారి డాక్టర్ తిరుమలప్రసాద్ మాట్లాడారు. అనారోగ్యంతో ఉన్న పిల్లలకు మాత్రలు వేయకూడదని మధ్యాహ్నం భోజనం తరువాత స్వచ్ఛమైన నీటితోనే మాత్ర మే స్పష్టం చేశారు.శుక్రవారం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులకు మాత్రలు వేయడం జరుగుతుందని ఈరోజు మాత్రలు వేసుకోలని పిల్లలకు అక్టోబర్ 5వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో తప్పనిసరిగా వేయాలని పేర్కొన్నారు. నులి పురుగుల నివారణ మందు (ఆల్బెండ జోల్) పంపిణీ కార్యక్రమంను పిల్లల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమా న్ని నిర్వహించడం జరుగుతుందన్నా రు.వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలందరికీ ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలను వేయడం జరుగుతోందని డాక్టర్ తిరుమలప్రసాద్ వెల్లడించారు.నులిపు రుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. భోజనానికి ముందు, మలవిసర్జన తర్వాత చేతుల ను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలన్నారు.కాచి చల్లార్చిన లేదా సురక్షితమైన తాగునీటిని మాత్ర మే తాగాలని పేర్కొన్నారు.కూరగాయ లు, పండ్లను శుభ్రమైన నీటితో కడిగిన తర్వాతే తినాలన్నారు.బయట తిరిగేట ప్పుడు తప్పని సరిగా చెప్పులు ధరిం చాలని,పిల్లల చేతి గోళ్లను ఎప్పటి కప్పుడు కత్తిరించాలన్నారు.గోళ్లు కొరకకుండా చూసుకోవాలన్నారు. గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాలలో జాతీయ నులిపురుగుల దినోత్సవ కార్యక్రమము సందర్భంగా విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలను వేయడం జరిగిందని వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్ వెల్లడించారు.ఉల్లిభద్ర గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్యాధి కారి డాక్టర్ మరడాన చాందిని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు.ఈకార్యక్రమంలో హెల్త్ విజిటర్ చింతాడ ఉదయకుమారి తదితరులు పాల్గొన్నారు.