BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

ఏపీలో కొత్త ఎక్సైజ్‌ పాలసీకి సన్నాహాలు.. 807 మద్యం దుకాణాలకు లాటరీ

Select Suryaa Now
ఏపీలో కొత్త ఎక్సైజ్‌ పాలసీకి సన్నాహాలు.. 807 మద్యం దుకాణాలకు లాటరీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 ఎక్సైజ్‌ పాలసీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,736 మద్యం దుకాణాల్లో 2,929 దుకాణాల రెన్యూవల్‌ ప్రక్రియ పూర్తయింది.

ఇంకా కేటాయించాల్సిన 807 దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నారు. ఇందులో 799 దుకాణాలు ఓపెన్‌ కేటగిరీలో, మరో 8 దుకాణాలు రిజర్వుడ్‌ కేటగిరీలో ఉన్నాయి.

ఈ మేరకు ప్రభుత్వం సెప్టెంబర్‌ 24న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి అక్టోబర్‌ 1 వరకు గడువు ఇచ్చింది. గడువు ముగిసిన అనంతరం అర్హత కలిగిన దరఖాస్తుదారుల నుంచి లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు.

2026–27 ఎక్సైజ్‌ పాలసీలో భాగంగా మిగిలిన దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి, కొత్త పాలసీ ప్రకారం మద్యం విక్రయాల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.