BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

టిడ్కో గృహాలు మంజూరు కాని లబ్ధిదారులకు సొమ్ము వాపస్ ఎనిమిది మందికి రూ.లక్ష చొప్పున చెక్కుల అందజేత మిగిలిన లబ్ధిదారుల ఖాతాల్లోనూ సొమ్ము జమ చేస్తాం మంత్రి వాసంశెట్టి సుభాష్

Select Suryaa Now
టిడ్కో గృహాలు మంజూరు కాని లబ్ధిదారులకు సొమ్ము వాపస్  ఎనిమిది మందికి రూ.లక్ష చొప్పున చెక్కుల అందజేత  మిగిలిన లబ్ధిదారుల ఖాతాల్లోనూ సొమ్ము జమ చేస్తాం   మంత్రి వాసంశెట్టి సుభాష్

రామచంద్రపురం మేజర్ న్యూస్: రా మచంద్రపురం పట్టణంలోని టిడ్కో గృహ సముదాయంలో వివిధ కారణాల వల్ల గృహాలు మంజూరు కాని ఎనిమిది మంది లబ్ధిదారులకు వారు గతంలో చెల్లించిన సొమ్మును అధికారులు మంత్రి సుభాష్ చేతుల మీదుగా తిరిగి అందజేశారు. ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ.లక్ష చొప్పున మొత్తం ఎనిమిది మందికి చెక్కుల రూపంలో నగదు వాపస్ చేశారు.మంత్రి వాసంశెట్టి సుభాష్, మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్.రాజు, టిడ్కో సిఎల్‌టిసి బిందు, పట్టణ టిడిపి అధ్యక్షులు ఉండవల్లి శివ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ.. టిడ్కో గృహాల విషయంలో వివిధ కారణాల వల్ల కొంతమంది లబ్ధిదారులకు సాంకేతిక కారణాలవల్ల గృహాలు మంజూరు కాలేదన్నారు. అటువంటి లబ్ధిదారులు గతంలో చెల్లించిన సొమ్మును ప్రభుత్వం తిరిగి చెల్లించే చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ రోజు ఎనిమిది మంది లబ్ధిదారులకు చెక్కుల ద్వారా సొమ్మును అందజేశామని, మిగిలిన అర్హులైన లబ్ధిదారుల సొమ్మును కూడా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే చర్యలు చేపడతామని వెల్లడించారు.

ప్రభుత్వం లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమస్యలను పరిష్కరిస్తోందని మంత్రి సుభాష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్-2 ఇన్‌చార్జి కంచుమర్తి బాబురావు, పడాల బాబి,బన్ను, లబ్ధిదారులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.