BREAKING
మేడ్చల్‌లో విద్యుత్ భద్రతా నిబంధనలకు తూట్లు.. ఎల్‌సీ లేకుండానే ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ప్రైవేట్ సిబ్బంది ప్రజా సమస్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక దృష్టి 2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకు తాగునీటి కనెక్షన్! నకిలీ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలపై చర్యలు తీసుకోవాలి ఢిల్లీ అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటో కేసు ప్రేమించిన వ్యక్తి మరణం తట్టుకోలేక... యువతి ఆత్మహత్య విద్యుత్ స్తంభాలే ప్రమాదం ఘటికలు స్థల వివాదంపై కలెక్టర్‌కు ఫిర్యాదు SIR ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి గోవాలో షూటింగ్ చేస్తుండగా హీరో విశాల్‌కు తీవ్ర గాయం భగత్ సింగ్ జీవితం స్ఫూర్తిదాయకం మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువత ప్రతిజ్ఞ ఎల్లంపేట్ బీజేపీ నేతలకు జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు పిట్టగూడలో పాడైన బోర్‌వెల్‌.. తాగునీటికి ఇబ్బందులు ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

ఉచిత కంటి వైద్య శిబిరం

Select Suryaa Now
ఉచిత కంటి వైద్య శిబిరం

బిజెపి ఆధ్వర్యంలో…

ఉచితకంటి వైద్య శిబిరం…

మండపేట మేజర్ న్యూస్: వికసిత్‌ భారత్‌–2047, సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా మండపేటలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

బీజేపీ నాయకుడు కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో ది మండపేట మోటారు మెకానికల్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ హాల్‌లో అసోసియేషన్‌ అధ్యక్షుడు ఈదిపల్లి సాంబశివరావు అధ్యక్షతన ఈ శిబిరం నిర్వహించారు. రాజమహేంద్రవరం లోని గౌతమి నేత్రాలయానికి చెందిన ఆప్టోమెట్రిస్ట్‌ సహీరా భాను సుమారు 160 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కంటి శుక్లం శస్త్రచికిత్స అవసరమైన 15 మందిని గుర్తించి, వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు గౌతమి నేత్రాలయ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమాన్ని ప్రోగ్రాం మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శలాకోటేశ్వరరావు, సెక్రటరీ మేడిశెట్టి వీరబాబు, జాయింట్‌ సెక్రటరీ మగ్గం రాంబాబు, గౌరవ అధ్యక్షుడు నాగులపల్లి ఈశ్వరరావు, బీజేపీ నాయకులు కోటిపల్లి సాయిరాం, మద్దుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.