పిట్టగూడలో పాడైన బోర్‌వెల్.. తాగునీటికి ఇబ్బందులు
పలుమార్లు తెలిపినా మరమ్మతులు చేయలేదని గ్రామస్తుల ఆవేదన
సూర్య తిర్యాణితిర్యాణి మండలం మంగి గ్రామపంచాయతీ పరిధిలోని పిట్టగూడలో బోర్‌వెల్ పాడవడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. మరమ్మతులు చేయించాలని సర్పంచ్, గ్రామపంచాయతీ కార్యదర్శికి పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.బోర్‌వెల్ చుట్టూ ప్లాట్‌ఫామ్ లేకపోవడంతో ఆ ప్రాంతం దిగబడిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించిందని వారు ఆరోపించారు. ప్రజాధనంతో చేసే పనుల్లో నాణ్యత పాటించాలని కోరారు.గ్రామస్తులు కనక రమేష్, శంకర్ మాట్లాడుతూ బోర్‌వెల్ సమస్యను సుమారు పది సార్లు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మరమ్మతులు చేపట్టలేదన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బోర్‌వెల్‌ను బాగు చేయడంతో పాటు చుట్టూ ప్లాట్‌ఫామ్ నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా అంబుబాయి, సీతారాం, జంగు, కనకరాజు, దశవంతరావు, భీమ్రావు, రాము తదితరులు ఉన్నారు.