BREAKING
ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రఘువీరారెడ్డి రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డియోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న--ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి వచ్చే రెండు దశాబ్దాలు దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకం: సీఎం చంద్రబాబు బహదూర్ గూడ భూముల అంశంపై ఎమ్మెల్యే ప్రెస్ మీట్ సైబర్ నేరాలు, POCSO, డ్రగ్స్‌ కౌన్సెలింగ్ పై NCC విద్యార్థులకు అవగాహన తిరుపతిలో ఘోర ప్రమాదం ముగ్గురు మృతి ఇద్దరు పరిస్థితి విషమం షేర్ మొహమ్మద్ పేట లో సర్పంచ్ ఎలక్షన్ హీట్ విజయవాడలో పేదలకు పట్టాభిషేకం మోడల్ సొసైటీగా అంబాజీపేట వరికుంటపాడు, రామాపురం చేరుకున్నపవన్ మీ ఇల్లు మీ హక్కుతో పేదలకు భారీ భరోసా గుండె జబ్బులు కేవలం వృద్ధుల్లోనే వస్తాయనే అపోహ వీడాలి: కిమ్స్ హాస్పిటల్స్ 30 తేదీ సీఎం సభను విజయవంతం చేయండి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు సాదర వీడ్కోలు

ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

Select Suryaa Now
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

నగరంలో ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం

- రూ.300 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

- ఎమ్మెల్యే ఆదిరెడ్డి... ఎమ్మెల్సీ సోము

రాజమహేంద్రవరం :

నగరపాలక సంస్థ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఏం) ద్వారా మంజూరు చేసిన రూ.300 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. కంబాల చెరువు వద్ద ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం సమీపంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి హెచ్ఏఏం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ నగరానికి మంజూరైన రూ.300 కోట్లలో సుమారు రూ.224 కోట్లతో సీసీ, బీటీ రహదారులు, డ్రైన్లు, సెంట్రల్ మీడియన్లు, స్ట్రీట్ లైటింగ్, పార్కులు, ప్రత్యేక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. సగటున ప్రతి వార్డుకు రూ.5–6 కోట్ల మేర అభివృద్ధి పనులు అందేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. హైటెక్ బస్‌స్టాండ్, కంబాల చెరువు జంక్షన్లలో ముంపు సమస్యకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హైటెక్ బస్టాండ్ ప్రాంతంలో డ్రైనేజీ నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు పబ్లిక్ హెల్త్ విభాగం ద్వారా రూ.6 కోట్లతో కొత్త డ్రెయిన్ పనులు అక్టోబర్ మూడో వారంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. అదనంగా రోడ్ల ఎత్తు పెంపు కోసం మరో రూ.2 కోట్లతో పనులు చేపడతామని, మొత్తంగా రూ.8 కోట్లతో అక్కడి దీర్ఘకాలిక ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కంబాల చెరువు జంక్షన్ నుంచి నల్లా ఛానల్ వరకు ఉన్న ప్రధాన డ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.25 కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే నల్లా ఛానల్ నుంచి గోదావరిలోకి వర్షపు నీటిని వేగంగా తరలించేందుకు రూ.2.26 కోట్లతో మరో వెంటు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో ముంపు సమస్య తీవ్రంగా ఉన్న పలు ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్ల ఎత్తు పెంపు, డ్రైన్ల నిర్మాణం వంటి పనులు చేపట్టి నీటి నిల్వ సమస్యను తగ్గించినట్లు ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. నగరంలో దశాబ్దాలుగా ఉన్న ముంపు సమస్యకు తాత్కాలిక చర్యలతో కాకుండా సమగ్ర ప్రణాళిక, సరైన డిజైన్‌తో శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యమన్నారు.

*అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర సహకారం: సోము వీర్రాజు*

ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ హెచ్ ఏ ఏం ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలో భాగంగా రూపొందిందన్నారు. రాజమహేంద్రవరానికి రూ.300 కోట్ల నిధులు రావడం ద్వారా నగర మౌలిక వసతులకు పెద్దపీట పడుతోందని చెప్పారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని రహదారులు, విద్యుత్, దేవాలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధికి మరిన్ని నిధులతో పనులు చేపట్టే ప్రణాళిక ఉందన్నారు. నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారని సోము వీర్రాజు పేర్కొన్నారు. హెచ్ ఏ ఏం నిధులతో చేపడుతున్న పనులు పూర్తయితే నగర మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.