BREAKING
పిహెచ్ సి లో స్పెషలిస్ట్ డాక్టర్ ను నియమించండి.... రామాపురానికి సీఎం చంద్రబాబు. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి పుష్పాల వైభవంగా గరుడవాహనం బంగాళాఖాతంలో మరో వాయుగుండం బుచ్చిరెడ్డిపాలెంలో అభివృద్ధికి మరో అడుగు మేడ్చల్‌లో విద్యుత్ భద్రతా నిబంధనలకు తూట్లు.. ఎల్‌సీ లేకుండానే ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ప్రైవేట్ సిబ్బంది ప్రజా సమస్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక దృష్టి 2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకు తాగునీటి కనెక్షన్! నకిలీ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలపై చర్యలు తీసుకోవాలి ఢిల్లీ అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటో కేసు ప్రేమించిన వ్యక్తి మరణం తట్టుకోలేక... యువతి ఆత్మహత్య విద్యుత్ స్తంభాలే ప్రమాదం ఘటికలు స్థల వివాదంపై కలెక్టర్‌కు ఫిర్యాదు SIR ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

ఆక్రమణ లు స్వచ్ఛందంగా తొలగించాలి

Select Suryaa Now
ఆక్రమణ లు స్వచ్ఛందంగా తొలగించాలి

ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలి: కమిషనర్ రాహుల్ మీనా*

*టౌన్ ప్లానింగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్*

నగరంలోని రహదారులు, ఫుట్ పాత్ లను ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా తొలగించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. నిబంధనలు అతిక్రమించి ప్రజా రహదారులు, ఫుట్ పాత్లు, కాలువలపై దుకాణాదారులు నిర్మించిన అక్రమ నిర్మాణాల తొలగింపునకు పట్టణ ప్రణాళిక అధికారులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సోమవారం కొనసాగింది. నగరపాలక కమిషనర్ ఆదేశాల మేరకు ఏవీఏ రోడ్డు, రామాలయం జంక్షన్ వద్ద రోడ్డు, ఫుట్ పాత్ లపై అడ్డంగా ఉన్న బడ్డీలు, తోపుడుబండ్లను జేసీబీ సాయంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. రోడ్లను విశాలంగా ఉంచడంతో పాటు ట్రాఫిక్ కు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా, ప్రమాదాల నివారణకు ఈ చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించడం, ఫుట్‌ పాత్‌లను పునరుద్ధరించడం, పాదచారుల భద్రతను మెరుగుపరచడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించడం జరుగుతుందన్నారు. ఆక్రమణలను తొలగించిన ప్రాంతాలలో మరలా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వచ్ఛ రాజమహేంద్రవరం, ప్రమాదాల నివారణ, విశాలమైన రహదారుల కోసం ప్రజలు నగరపాలక అధికారులకు సహకరించాలని కోరారు.