ముంపుకు గురైన పంట పొలాల్లో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పర్యటన
*ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ
*– త్వరితగతిన పంట నష్టం అంచనా వేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం*
*సీతానగరం మండలం కాటవరం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ బత్తుల బలరామకృష్ణ స్వయంగా పరిశీలించారు. వర్షపు నీటిలో దిగి దెబ్బతిన్న వరి, ఇతర పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తీవ్రంగా నష్టపోయిన రైతులతో మాట్లాడారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ... "భారీ వర్షాల వల్ల కాటవరం పరిసర ప్రాంతాల్లో రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలు నీటమునిగి తీవ్రంగా నష్టపోవడం బాధాకరం. రైతాంగాన్ని అన్ని వేళలా ఆదుకోవడమే మన కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఏ ఒక్క రైతు ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది" అని హామీ ఇచ్చారు.*
*అలాగే, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో ఆయన మాట్లాడి, వెంటనే ముంపునకు గురైన ప్రతి ఎకరాన్ని పరిశీలించి త్వరితగతిన పంట నష్టం అంచనా వేసి సమగ్ర రిపోర్ట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అధికారుల నివేదిక ఆధారంగా నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకూ ప్రభుత్వ పరంగా తగిన పరిహారం మరియు సహాయక చర్యలు అందేలా చూస్తామని స్పష్టం చేశారు.*
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, జనసేన, తెలుగుదేశం, బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు పాల్గొన్నారు.