BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

Select Suryaa Now
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్, తిరుపతి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి పలువురు హాజరై కంటి పరీక్షలు చేయించుకోగా, వైద్యులు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. వచ్చిన వారికి మజ్జిగ, మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు జూలియన్ రాజు మాట్లాడుతూ, శిబిరం నిర్వహణకు సహకరించిన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ వైద్య బృందానికి, అనుమతులు ఇచ్చిన ఎంపీడీవో, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర, ట్రెజరర్ కోటేశ్వరరావు, సభ్యులు గంగారి రమేష్, ప్రభాకర్, నవీన్, నరేష్, అరుణ్ పాండ్యన్, అనిల్, ప్రభు, మురళి తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: రమేష్ బాబు కొండల