BREAKING
రష్మిక 'మైసా' టీజర్ రెస్పాన్స్: ఊహించని మాస్ అవతార్‌తో మైండ్ బ్లాక్ చేసిన నేషనల్ క్రష్ భగవంతుడు అందరికీ ఒక్కడే జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక టాస్క్ ఫోర్స్ సదస్సును ప్రారంభించనున్న అమిత్ షా ఎస్ఈసీఐ 15 ఏళ్ల ప్రస్థానం, పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశపు పెరుగుతున్న నాయకత్వానికి నిదర్శనం యువత భవితే కూటమి ప్రభుత్వ లక్ష్యం నేషనల్ ఫార్ములేరీ ఆఫ్ ఇండియా 2026ని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ చిన్నారి వైద్యానికి మంత్రి సుభాష్ మానవతా హస్తం అరుదైన బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న మహిశ్రీకి ఆర్థిక సాయం కీసరలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం జైపూర్‌లో WWF గ్లోబల్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ ​కలంతోనే కాదు.. రక్తంతోనూ ప్రాణరక్షణ! ​టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ 4వ క్లౌడ్ రీజియన్ ప్రారంభం అనీషా వలలో జూనియర్ అసిస్టెంట్,అవుట్సోర్సింగ్ సిబ్బది. ఉండవల్లి గుహాలయాల ప్రత్యేకత.. ఇరవై అడుగుల ఏకశిలా అనంత పద్మనాభస్వామి శిల్పకళా వైభవం! భారత్ వర్సెస్ జపాన్ టీ20 పోరుపై తుపాను ముప్పు: మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం ఉందా? నకిలీ కొవిడ్ సర్టిఫికెట్ వివాదం: స్విట్జర్లాండ్ కెప్టెన్ గ్రానిట్ జాకాపై వేటు.. విచారణకు హాజరుకావాలని ఆదేశం

టీటీడీ ఛైర్మన్‌పై టీడీపీలో కొత్త చర్చ

Select Suryaa Now
టీటీడీ ఛైర్మన్‌పై టీడీపీలో కొత్త చర్చ

టీటీడీ ఛైర్మన్‌పై టీడీపీలో కొత్త చర్చ
బీఆర్‌ నాయుడుకు మరో అవకాశం లేనట్టేనా?.. 
కళా వెంకటరావు పేరు పరిశీలనలో?
ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ పదవిపై తెలుగుదేశం పార్టీలో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుత ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు పదవీకాలం ముగిసిన తర్వాత ఆయనకు మరో అవకాశం ఇవ్వకపోవచ్చన్న ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. ఆయన స్థానంలో తెలుగుదేశం సీనియర్‌ నేత, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మార్పుపై ఇప్పటివరకు ప్రభుత్వం లేదా టీటీడీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం బీఆర్‌ నాయుడే టీటీడీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. సెప్టెంబర్‌ 12న కూడా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు.బీఆర్‌ నాయుడు పదవీకాలంలో కొన్ని అంశాలు రాజకీయంగా వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన వీడియోపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. ఆ వీడియోలో కొంత భాగం వాస్తవమని, మరికొంత మార్ఫింగ్‌ చేసినదని బీఆర్‌ నాయుడు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ ఆందోళనలు నిర్వహిస్తూ ఆయన రాజీనామాకు డిమాండ్‌ చేసింది. అయితే ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం టీటీడీ కార్యకలాపాల్లో బీఆర్‌ నాయుడు కొనసాగుతున్నారు. సెప్టెంబర్‌ 17న బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులతో స్వయంగా మాట్లాడి సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సెప్టెంబర్‌ 19న గరుడసేవ ఏర్పాట్లను కూడా పరిశీలించారు.ఈ నేపథ్యంలోనే తదుపరి టీటీడీ పాలకమండలి ఏర్పాటుపై తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే స్థానిక ఎన్నికల నేపథ్యంలో తిరుమల అంశం రాజకీయ వివాదాలకు దూరంగా ఉండేలా కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలన్న ఆలోచన ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇవన్నీ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారమేనని, తుది నిర్ణయం ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉంటుందని చెబుతున్నారు.
కళా వెంకటరావు పేరు తెరపైకి రావడానికి ఆయన సీనియారిటీ ప్రధాన కారణంగా చెబుతున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న ఆయన మంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్స సత్యనారాయణపై విజయం సాధించారు. మంత్రి పదవి దక్కకపోవడంతో సీనియర్‌ నేతకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్న అభిప్రాయం ఉత్తరాంధ్ర పార్టీ శ్రేణుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్‌ పదవి ఆయనకు ఇస్తే ఉత్తరాంధ్రకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించినట్టవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే బీఆర్‌ నాయుడు పదవీకాలం, తదుపరి టీటీడీ పాలకమండలి నియామకంపై అధికారిక నిర్ణయం వెలువడే వరకు కళా వెంకటరావు నియామకాన్ని ఖరారైన విషయంగా చెప్పలేమని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి