BREAKING
మైనార్టీల ఆస్తులు కబ్జా చేస్తారా? నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రష్యన్ చమురు కొనుగోలుదారులపై అమెరికా ఆంక్షల చట్టం: నిశితంగా పరిశీలిస్తున్నామన్న పీయూష్ గోయల్ నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి... ఆ కారణంతోనే ఏ సర్టిఫికెట్ జారీ చేసిన మేకర్స్ ఓటీటీలోకి ఎం.ఎస్. రాజు మిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'అగాధ': డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్! నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏల ధర్నా 'అనుమాన పక్షి' రిలీజ్ ట్రైలర్ అవుట్: 'డీజే టిల్లు' డైరెక్టర్ నుంచి క్రేజీ డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్! పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి - కలెక్టర్ రాజకుమారి గణీయా క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు సెప్టెంబర్ 25 న జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న హిందూపురంలో అంబరాన్నంటిన గణేష్ నిమజ్జనం: 50 అడుగుల గరిడి గణేశుడిపై హెలికాప్టర్‌తో పూల వర్షం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి- ఎస్ డీపీఐ వరంగల్ ఎయిర్ పోర్టుకు"సమ్మక్కసారలమ్మ"పేరు పెట్టాలి కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు చిరస్మరణీయం నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి: చేతి టాటూపై అభ్యంతరం.. సీబీఎఫ్‌సీ ఏ సర్టిఫికేట్ మంజూరు

తిరుమలేశుని సేవలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‎

Select Suryaa Now
తిరుమలేశుని సేవలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ‎

ఎల్ నినో ప్రభావం నుంచి ప్రజలను కాపాడాలని వేడుకోలు

‎తిరుమల :‎తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న డిప్యూటీ సీఎంకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు.

‎అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఆయన తన మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా, టీటీడీ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

‎రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి

‎ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ — "శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థించాను" అని తెలిపారు.

‎ప్రకృతి వైపరీత్యాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ — "ప్రకృతి పరంగా వస్తున్న ఎల్ నినో  ప్రభావం వల్ల వర్షపాతం తగ్గి పంటలు, నదులు, తాగునీరు మరియు సాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు గానీ, ప్రజల జీవన విధానానికి గానీ ఎటువంటి ఆటంకం కలగకూడదని ఆ స్వామివారిని వేడుకున్నాను. ప్రకృతి వైపరీత్యాల నుంచి దేశాన్ని, రాష్ట్రాలను కాపాడి సుభిక్షంగా ఉంచాలని శ్రీవారిని ప్రార్థించాను" అని పేర్కొన్నారు.