BREAKING
ఆర్నబ్‌ తుపాను తాజా పరిస్థితి అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో వాడరేవులో ఎమ్మార్వో గోపి కృష్ణ పర్యవేక్షణ విద్యార్థులు మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు -ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి -నషా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ కాలుష్య పరిశ్రమను మూసివేయండి... ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైసిపి జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ్ ప్రాదేశిక ఎన్నికల ప్రచారం. ఎలమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం వైసీపీ పట్టణ అభివృద్ధి చేసింది లేదు.. ఎమ్మెల్యే బివి నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీ నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీమాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్, మెచినేని శ్రీనివాసరావు ట్రస్ట్ సహకారం హోసింగ్ ఏ ఈ సాయి కుమార్ హామీతో,,ఇందిరమ్మ ఇండ్ల బాధితులు ఆందోళన, నిరసన విరమణ కూటమి అభ్యర్థులను గెలిపించండి .. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకే గ్రామంలో రెండు బొడ్రాయిలా?... గ్రామ ప్రజల్లో ఆందోళన భవిష్యత్తు ఉపాధి అవకాశాలను ఎన్నుకోవాలి. డి.ఎస్.పి యూరప్‌లో జెన్-జీ నిరసనల హోరు...ప్రభుత్వాల తీరుపై యువత తీవ్రాగ్రహం ప్రత్యేక అవసరాల విద్యార్థులకు క్రీడ పోటీలు:ప్రారంభించిన మండల విద్యాధికారి శంకర్

తిరుపతి జడ్పీ చైర్ పర్సన్ గా హేమలత

Select Suryaa Now
తిరుపతి జడ్పీ చైర్ పర్సన్ గా హేమలత

తిరుపతి జిల్లా పరిషత్ మొదటి ఛైర్ పర్సన్ ఎంపికపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే హేమలత వైపు మొగ్గుచూపి, ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన తిరుపతి జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు నాగలాపురం స్థానం నుండి ఆమెను బరిలోకి దింపుతోంది. ఈ మేరకు మంగళవారమే పార్టీ హైకమాండ్ హేమలతకు బి-ఫామ్ అందజేయడంతో, రేపటి నుంచే ఆమె తన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడంతో ఈ ప్రతిష్టాత్మక స్థానం కోసం తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు ఆశావహులు పోటీ పడ్డారు. ఇదే సమయంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి తన రాజకీయ వారసురాలిగా తన రెండో కూతురైన డాక్టర్ చేతనను తెరపైకి తీసుకురావాలని భావించారు. శ్రీకాళహస్తి జెడ్పీటీసీ స్థానం కూడా ఎస్సీ మహిళకే రిజర్వ్ కావడంతో, అక్కడి నుంచి డాక్టర్ చేతన ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా మార్గం సుగమం చేసుకున్నారు. మరోవైపు, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత ఏకంగా నాలుగు స్థానాల నుంచి నామినేషన్లు దాఖలు చేసి సర్వత్రా ఆసక్తి రేకెత్తించారు.

కూటమి పొత్తుల రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ పదవి ఏ పార్టీకి దక్కినా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో హేమలత వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇందులో భాగంగా సత్యవేడు, వరదయ్యపాళెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా, నాగలాపురంలో టీడీపీ అభ్యర్థిగా, పిచ్చాటూరులో జనసేన అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. చివరికి పార్టీ అధిష్టానం ఆమె రాజకీయ సీనియారిటీని, పార్టీ పట్ల ఆమె చూపుతున్న నిబద్ధతను పరిగణలోకి తీసుకుని నాగలాపురం స్థానం నుంచి బరిలో నిలపాలని నిర్ణయించింది.

సత్యవేడు మాజీ ఎమ్మెల్యేగా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న హేమలత, మొదటి నుంచి ఏనాడూ పార్టీ వీడకుండా టీడీపీలోనే కొనసాగుతున్నారు. మండల పరిషత్ అధ్యక్షురాలిగా, ఎమ్మెల్యేగా పార్టీ జెండా కిందే ఆమె రాజకీయ విజయాలు సాధించారు. అయితే, 2014, 2019 ఎన్నికల్లో సత్యవేడు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇక 2024 ఎన్నికల్లో తన కూతురు హెలెన్‌ను బరిలోకి దించాలని గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ, అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్టీ మారిన పరిణామాల నేపథ్యంలో ఆమె ఆశలు నెరవేరలేదు. అయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా, టికెట్ దక్కకపోయినా పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటూ తన విధేయతను చాటుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ల ఆశీస్సులతో జెడ్పీ ఛైర్ పర్సన్ రేసులో నిలిచిన హేమలతకు, చివరకు ఆమె చేసిన కష్టానికి, పార్టీకి చూపిన విధేయతకు తగిన గుర్తింపు లభించినట్లయింది.

 నగేష్ సూర్య ప్రత్యేక ప్రతినిధి