తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం: భక్తులకు హెచ్చరిక
తిరుమల, సూర్య ప్రతినిధి :తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుతపులి ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. నడకమార్గంలోని మోకాలిమిట్ట ప్రాంతంలో మెట్ల పక్కన వేకువజామున సుమారు 2 గంటల సమయంలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో నడకమార్గంలో భక్తుల సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటన నేపథ్యంలో కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, భద్రతా సిబ్బంది మరియు టీటీడీ సూచనలను తప్పక పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.