BREAKING
వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ!

టిడిపి కూటమితోనే సాధ్యం

Select Suryaa Now
టిడిపి కూటమితోనే సాధ్యం

టిడిపి కూటమితోనే సాధ్యం

వెనుకబడిన తరగతుల హక్కుల రక్షణ కూటమి బాధ్యత.

బీసీల ఐక్యత విజయానికి సోపానం. 

బీసీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత టిడిపి దే.

దర్శి నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో వైసీపీ కనుమరుగు అవ్వాలి.

 

బిసి లకు రాజ్యాధికారం కల్పించమే కూటమి ప్రభుత్వ ధ్యేయం.*

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పిస్తాం .

మున్సిపాలిటీ గెలిచి చంద్రబాబు కు గిఫ్ట్ ఇద్దాం.

 డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.

సూర్య న్యూస్ దర్శి. జయహో బిసి నినాదం కాదని టిడిపి ప్రధానమని

స్థానిక సంస్థల ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చే తీర్పుతో వైసీపీ కనుమరుగు అవ్వాలని, బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందని దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో వైఎస్సార్‌సీపీ అనుసరించిన వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం దర్శి టిడిపి కార్యాలయం లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశం పై డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న కృషిని వివరించడంతోపాటు, ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ వైఖరిని ఎండగడుతూ సమావేశంలో చర్చించారు. డాక్టర్ లక్ష్మి.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూబీసీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం, నాయకత్వ అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని తొలుత గుర్తించిన పార్టీ తెలుగుదేశమని పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు రాజకీయాల్లో ఎదిగి నాయకులుగా మారినప్పుడే వారి జీవితాల్లో మార్పు వస్తుందనే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. తొలుత 20 శాతంగా ఉన్న రిజర్వేషన్లను క్రమంగా పెంచుకుంటూ వచ్చారని, ప్రస్తుతం 34 శాతం రిజర్వేషన్ల దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా, నాయకత్వ బాధ్యతలు చేపట్టే స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని, ఎన్టీఆర్‌ కులాల మధ్య విభజన రాజకీయాలకు భిన్నంగా సామాజిక సమానత్వానికి ప్రాధాన్యమిచ్చారని, చంద్రబాబు నాయుడు సైతం బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారని గొట్టిపాటి లక్ష్మీ చెప్పారు. యువతకు, వెనుకబడిన వర్గాలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా అనేక మంది నాయకులను తయారు చేసిన రాజకీయ వేదికగా టీడీపీ నిలిచిందన్నారు.

 

 

**రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీని ప్రశ్నించిన Dr. గొట్టిపాటి లక్ష్మీ.**

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తోందని Dr. గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. సుప్రీంకోర్టులో 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు ఉన్నప్పటికీ, బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన పరిస్థితులను ప్రస్తావిస్తూ, ఆయా రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలు, వాటి వెనుక ఉన్న న్యాయపరమైన కారణాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జనగణన, సామాజిక వెనుకబాటుతనానికి సంబంధించిన గణాంకాలు, న్యాయపరమైన అంశాలు రిజర్వేషన్ల నిర్ణయాల్లో కీలకమని పేర్కొన్నారు.

దర్శి నియోజకవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్థానికంగా బలమైన నాయకత్వం ఉండటం, విభేదాలు వచ్చినా చర్చల ద్వారా పరిష్కరించుకునే సామర్థ్యం ఉండటం నియోజకవర్గ ప్రత్యేకతగా అభివర్ణించారు. ఈ ఐక్యతను కాపాడుకుంటూ రానున్న ఎన్నికల్లో సమష్టి కృషితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

దర్శి నియోజకవర్గం లోని 5మండల టిడిపి అధ్యక్షులలో 3మండలు టిడిపి అధ్యక్షులు గా ప్రకటించి బిసి లు అంటే తెలుగుదేశం పార్టీ అని నిరూపించామని గుర్తు చేశారు.

రానున్న ఎన్నికల్లో బీసీలు ఐక్యంగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని, దర్శి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి రాజకీయంగా స్థానం లేకుండా చేసే దిశగా కూటమి శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.  

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన సందర్బంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ  ఆధ్వర్యంలో నియోజకవర్గం లోని బిసి సోదరులు రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమం లో దర్శి, దొనకొండ, కురుచేడు మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, మోడీ ఆంజనేయులు, పిడతల నేమిలయ్య, ఏఎంసి వైస్ చైర్మన్ కోడిగా మస్తాన్ రావు, జిల్లా టిడిపి కార్యవర్గ సభ్యులు గడ్డం బాలయ్య, పఠాన్ సుభాని, వల్లెపు నారాయణ, మోడీ వెంకటేశ్వర్లు, డా. షేక్ సునీల్, రమణా యాదవ్, దర్శి మండల బిసి అధ్యక్షులు మేకబోయిన సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ కొక్కెర నాగరాజు, పిన్నిక రమేష్, షేక్ అల్లాభక్ష, కౌన్సిలర్ రాంగిరి నియోజకవర్గం లోని బిసి సోదరులు పాల్గొన్నారు.