పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ఎస్.టి.యు నేత బోనం గంగాధర్!
సూర్య రీజినల్ డెస్క్ (అంబాజీపేట/అమలాపురం): రెండవ విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు. అంబాజీపేటకు చెందిన ఎస్.టి.యు (STU) రాష్ట్ర ఉపాధ్యాయ వాణి కన్వీనర్ బోనం గంగాధర్ మాచవరం పంచాయతీలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విధుల నిర్వహణలో భాగంగా ముందస్తు ఓటింగ్:
ఎన్నికల రోజున పోలింగ్ విధుల్లో నిమగ్నమై ఉండే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును కోల్పోకుండా ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకున్నారు. బోనం గంగాధర్‌తో పాటు ఎన్నికల విధులకు హాజరవుతున్న ఇతర ఉపాధ్యాయులు కూడా బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.