స్వర్ణ గ్రామం భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే.
మెలియాపుట్టి.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన స్వర్ణ గ్రామం భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అవసరమైన సదుపాయాలను కల్పిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.