BREAKING
రేవంత్ రెడ్డి కంటపడింది..సిరిసిల్ల ప్రజల పంట పండింది! సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు అంబేద్కర్ ఆశయాలే సమాజ ప్రగతికి బాటలు మెక్సికో వైపు దూసుకొస్తున్న అత్యంత భయంకరమైన 'పోలో' తుఫాను ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు మన్మోహన్ సింగ్ గొల్ల కురుమల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం పొగాకు రైతుల తరపున కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ 'పుట్టా' కృతజ్ఞతలు భవనం లేక చెట్టు కిందే గ్రామసభ! శాతవాహన యూనివర్సిటీ వద్ద ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి డి ఈ ని కలిసిన కొదురుపాక సర్పంచ్ 28న కరీంనగర్‌లో 'శాతవాహన గ్రామీణ సంత' వాల్ పోస్టర్ ఆవిష్కరణ యువతలోని ప్రతిభను వెలికితీయడమే యువజన సాంస్కృతిక పోటీల లక్ష్యం రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం ముగియనున్న పసిడి రుణాల హవా పోస్టర్ల ఆవిష్కరణ

స్వర్ణ గ్రామ కార్యదర్శుల చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదు జిల్లా ఎస్పీ జగదీష్

Select Suryaa Now
స్వర్ణ గ్రామ కార్యదర్శుల చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదు జిల్లా ఎస్పీ జగదీష్

అనంతపురం బ్యూరో: 

 

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈనెల 27న చేపట్టనున్న “చలో విజయవాడ” కార్యక్రమానికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ పి.జగదీష్,  తెలిపారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనాలు, ప్రమోషన్ అవకాశాలు, జీవో నెంబర్.11 రద్దు తదితర డిమాండ్లతో విజయవాడలో ధర్నాకు ఉద్యోగులు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.

అనుమతి లేని ర్యాలీలు, ధర్నాల్లో పాల్గొని ఇబ్బందులు తెచ్చుకోవద్దని ఉద్యోగులకు ఎస్పీ సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారుల ఆదేశాలను ఉల్లంఘించి కార్యక్రమానికి హాజరైతే నిబంధనల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను పాటించి “చలో విజయవాడ” కార్యక్రమానికి వెళ్లకుండా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.