పోస్టర్ల ఆవిష్కరణ
అనంతపురం బ్యూరో
తెలంగాణలోని ఖమ్మం పట్టణంలో ఈనెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నాలుగో జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ గుంతకల్ డివిజన్ కార్యదర్శి బి.సురేష్ పిలుపునిచ్చారు.
గుంతకల్‌లోని రామిరెడ్డి కాలనీలో శనివారం మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ పెట్టుబడుల భారం, కరువు, వలసలు తదితర సమస్యలపై రైతాంగ ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమలో కరువు ప్రభావంతో నష్టపోయిన రైతులు, వ్యవసాయ కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు జిలాన్, సత్తార్, రామాంజనేయులు, రాందాస్, నారాయణ, నెట్టప్ప, మేరీ తదితరులు పాల్గొన్నారు.