BREAKING
బిజెపి ఉచిత మెగావైద్యశిబిరం విజయవంతం బ్రిక్స్ కూటమి వైపు ఆగ్నేయాసియా దేశాల చూపు.. బహుళ ధ్రువ ప్రపంచం మరియు ప్రత్యామ్నాయ వాణిజ్యంపై ఆసియాన్ ఆసక్తి కూటమి ప్రభుత్వ పల్లెపండగ విజయవంతం చేయాలి భారత్‌లో రెండో యుద్ధ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటుకు రఫేల్ ఒప్పందం దోహదం.. రక్షణ కార్యదర్శి కీలక వెల్లడి ప్యారడైజ్ కుక్క సీన్లపై ట్రోల్స్.. రాజమౌళి మగధీరను ఉదాహరణగా చూపుతూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కౌంటర్! కోయంబత్తూరులో సినీ ఫక్కీలో గుట్కా స్మగ్లర్ల పరారీ.. ఎస్‌యూవీపై 40 కి.మీ వేలాడిన హెడ్ కానిస్టేబుల్ హాలీవుడ్ అసలు మాయాజాలం అదే.. టెక్నాలజీ కంటే కథాబలమే ఎందుకు ముఖ్యం! వారణాసి గ్లింప్స్ ఈవెంట్‌లో ఆ సాంకేతిక సమస్య చూసి నిజంగానే ఏడుపొచ్చేసింది: ఎస్.ఎస్. కార్తికేయ చిరంజీవి అభిమానిలకు సత్కారం టమాటాలు ఎప్పటికీ తాజాగా, గట్టిగా ఉండాలా.. వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి! తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్

అమ్మ దర్శనం ఉచితం

Select Suryaa Now
అమ్మ దర్శనం  ఉచితం

అమ్మ దర్శనం ఉచితం

 దర్శన టికెట్లన్నీరద్దు,

వారికి మాత్రం స్పెషల్ టికెట్లు


ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి

విజయవాడ దుర్గ గుడిలో ఈసారి దసరా ఉత్సవాల సమయంలో భక్తుల దర్శనాలపై ఆలయ అధికారులు ఫోకస్ పెట్టారు. దసరా సమయంలో ‘భవానీ ప్రత్యేక దర్శనం’ పేరుతో టికెట్లు జారీ చేసి.. ఒక ప్రత్యేక క్యూలైన్ను ఏర్పాటు చేయనున్నారు. సామాన్య భక్తులందరికి ఉచితంగా దర్శనం కల్పిస్తారు. ఐదు లైన్లలో సాధారణ భక్తుల్ని దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. ఈ భవానీ ప్రత్యేక దర్శన టికెట్లను ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు, అధికారిక సిఫార్సులపై వచ్చేవారికి మాత్రమే కేటాయిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ ఏడాది భక్తులు భారీగా తరలివస్తారని అంచనా వేస్తున్న అధికారులు ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. దసరా సమయంలో ఇంద్రకీలాద్రిపై రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ భక్తుల క్యూలైన్లకు ఎక్కడా సిఫార్సుల దర్శనాలతో ఇబ్బంది రాకుండా ప్లాన్ చేశారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రస్తుతం ఉన్న రూ.100, రూ.300, రూ.500 టికెట్లను పూర్తిగా రద్దు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో అన్ని క్యూలైన్లను ఉచిత దర్శన లైన్లుగానే ఉంటాయంటున్నారు. దసరా సమయంలో వీఐపీలు, ప్రత్యేకంగా దర్శనం చేసుకోవాలనుకునేవారికి ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నారు. భవనానీ ప్రత్యేక దర్శనం పేరుతో టికెట్ ధర రూ.1000గా నిర్ణయించారు. కానీ ఈ స్పెషల్ టికెట్లు అందరికీ అందుబాటులో ఇవ్వరు. కేవలం ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అధికారిక సిఫార్సులపై వచ్చే భక్తులకు ఈ టికెట్లు కేటాయిస్తారు. ఇలా చేస్తే సిఫార్సుల ఒత్తిడి తగ్గుతుందంటున్నారు అధికారులు. భవానీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు జారీ చేసేందుకు ఇంద్రకీలాద్రి సమీపంలో ఉన్న కుమ్మరిపాలెం దగ్గర టీటీడీ స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ టీటీడీ స్థలాన్ని హైదరాబాద్ వైపు నుంచి వచ్చే భక్తుల కోసం కేటాయించారు. విజయవాడ వైపు నుంచి వచ్చేవారికి కాళేశ్వరరావు మార్కెట్, స్వరాజ్య మైదానం దగ్గర ఈ భవానీ ప్రత్యేక దర్శనం టికెట్ జారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇక్కడకు వచ్చిన వారు రూ.1000 టికెట్ తీసుకోవాలి.. అనంతరం వీరిని ప్రత్యేక వాహనాల్లో ఇంద్రకీలాద్రికి తరలిస్తారు. ఈ భవానీ ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్నవారికి ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేసి.. నేరుగా అంతరాలయ దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రత్యేక దర్శనాలను రోజులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి రెండు గంటల చొప్పున మొత్తం ఆరు గంటలు అనుమతిస్తారు. ఏ సమయంలో టికెట్లు ఇవ్వాలనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సాధారణ భక్తులకు 5 క్యూ లైన్ల ద్వారా దర్శనం కల్పిస్తారు. బంగారు వాకిలి దర్శనం, రూ.300, రూ.100 లైన్లు కలిపి దర్శనం చేసుకుంటారు. ఒకవైపు వినాయక ఆలయం, మరోవైపు కుమ్మరిపాలెం నుంచి భక్తులు 5 క్యూలైన్లలో దర్శనాలకు వస్తారు. ఘాట్ రోడ్డు నుంచి ఈ క్యూలైన్లను మూడిటిగా మారతాయి. అక్కడి నుంచి ఓం టర్నింగ్ పాయింట్ నుంచి మళ్లీ 5 క్యూలైన్ల ద్వారా దర్శనం కోసం వెళ్లేలా ప్లాన్ చేశారు. మొత్తం మీద విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.