విద్యుత్ కోతలను నివారించాలి* * సబ్ స్టేషన్ ల ముందు ధర్నా * సీపీఎం, వ్యకాసం డిమాండ్
*
చిట్యాల-మేజర్ న్యూస్
కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేసి, ఎండిపోతున్న పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కత్తుల లింగస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా, చిట్యాల మండలం చిన్నకాపర్తి, ఆరెగూడెం గ్రామాల్లోని విద్యుత్ సబ్ స్టేషన్ల ముందు సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు పడక, వరి పంటలకు నీరు అందక రైతులు అల్లాడుతున్న ఈ కీలక సమయంలో కరెంట్ కోతలు విధించడం దారుణమన్నారు. దీనివల్ల పచ్చని పంట పొలాలు ఎండిపోయి రైతన్నలు తీవ్రంగా నష్టపోయి దివాలా తీసే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరువుతో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతలను ఆదుకోవడానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.
అలాగే, చిన్న కాపర్తి సబ్ స్టేషన్ పరిధిలో పిట్టంపల్లి, బొంగోని చెర్వు ఫీడర్లు పనిచేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఆగిపోయిన ఫీడర్లను తక్షణమే మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఐతరాజు నరసింహ, చిన్నకాపర్తికి చెందిన రైతులు కోనేటి రాములు, వీరమల్ల వెంకన్న, రూపాని ఇదయ్య, శిరస్సు హనుమయ్య, వీరమల్ల శంకరయ్య, రుద్రారపు భిక్షం, రుద్రారపు పార్వతమ్మ, బొడ్డు నరసింహ, నకిరేకంటి గణేష్, మెట్టు అంజయ్య, బాలకృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆరెగూడెం గ్రామం నుండి లడే రాములు, తాటిపల్లి అంజయ్య, గడ్డ శేఖర్, గుడిగుళ్ల నరసింహ, బైరుకొండ చంద్రయ్య, తాటిపల్లి పాపయ్య, పెరుమళ్ళ మారయ్య, ఆరూరి చంద్రయ్య, కోమటిరెడ్డి ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.