BREAKING
ప్యారడైజ్ కుక్క సీన్లపై ట్రోల్స్.. రాజమౌళి మగధీరను ఉదాహరణగా చూపుతూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కౌంటర్! కోయంబత్తూరులో సినీ ఫక్కీలో గుట్కా స్మగ్లర్ల పరారీ.. ఎస్‌యూవీపై 40 కి.మీ వేలాడిన హెడ్ కానిస్టేబుల్ హాలీవుడ్ అసలు మాయాజాలం అదే.. టెక్నాలజీ కంటే కథాబలమే ఎందుకు ముఖ్యం! వారణాసి గ్లింప్స్ ఈవెంట్‌లో ఆ సాంకేతిక సమస్య చూసి నిజంగానే ఏడుపొచ్చేసింది: ఎస్.ఎస్. కార్తికేయ చిరంజీవి అభిమానిలకు సత్కారం టమాటాలు ఎప్పటికీ తాజాగా, గట్టిగా ఉండాలా.. వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి! తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను పునరుద్ధరించాలి వామపక్షాలు డిమాండ్

Select Suryaa Now
ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను పునరుద్ధరించాలి   వామపక్షాలు డిమాండ్

ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను పునరుద్ధరించాలి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: వామపక్షాల డిమాండ్

భీమవరం, మేజర్ న్యూస్:

ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను పునరుద్ధరించాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం భీమవరం కొత్త బస్టాండ్ వద్ద సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐయూ, ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. మ్యాపింగ్‌ కాలేదనే కారణంతో తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తూ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరారు.సీపీఐ జిల్లా కార్యదర్శి కొనాల భీమారావు మాట్లాడుతూ తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి దండు శ్రీనివాసరాజు, ఎంసీపీఐయూ నాయకులు కొల్లా బత్తుల మహంకాళి, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ భీమవరం