BREAKING
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎస్వీయూలో ‘అన్వేషణ-2026’ ప్రారంభం -జ్ఞానానికి ఆవిష్కరణ జోడిస్తేనే భవిష్యత్ : రెక్టర్ ఆచార్య చెండ్రాయుడు కొల్చారంలో ఆల్ ఇండియా బంజారా మేళా ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి రేణిగుంటలో ఓటర్ స్లిప్పుల బీఎల్వోలు ఇవ్వలేదని ఓటర్ల ఆగ్రహం.. పైతర గ్రామంలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం జడ్పిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం.. 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. 10782 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లు పేట స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా నరసింహ చారి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం ఎస్సై బాలరాజు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల సునామీ: సెనేట్, హౌస్ రెండూ వారివే సంక్షేమం అభివృద్ధి ఇవే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాలి మార్గం మధ్యలో 108 లో మహిళ ప్రసవం. అభివృద్ధి సంక్షేమం ఇవే కూటమి ప్రధాన లక్ష్యం సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

సురక్షితమైన దీపావళిని జరుపుకుందాం

Select Suryaa Now
 సురక్షితమైన దీపావళిని జరుపుకుందాం

ఆరిలోవ, సూర్య : దీపాల పండుగ దీపావళి ఆనందోత్సాహాలు, ఆత్మీయత, ఐక్యతకు ప్రతీక. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, సిరిసంపదలు, ముఖ్యంగా భద్రతను తీసుకురావాలని ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్  ఆకాంక్షిస్తోంది. పండుగ సంబరాలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో, కంటి భద్రతకు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలను ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వివరించింది. చూపు అనే అమూల్యమైన వరాన్ని ప్రమాదంలోకి నెట్టకుండా దీపావళి వెలుగులను  జీవితాల్లో నింపుకుందాం! బాణసంచా పేల్చడం వల్ల కలిగే కంటి గాయాలు స్వల్పమైన మంట, చికాకు, కంటి పై గీతలు పడటం నుంచి కార్నియా దెబ్బతినడం, కంటి లోపల రక్తస్రావం, గాయం కారణంగా కంటిశుక్లం ఏర్పడటం, రెటీనాకు నష్టం కలగడం, చివరికి శాశ్వతంగా చూపు కోల్పోవడం వరకు సంభావించవచ్చు. దీపావళి టపాకాయలు కాల్చే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి కన్సల్టెంట్ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ శిల్ప తరిణి, డాక్టర్ విశాల్ సంజయ్ జాదవ్ ఎల్‌.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్, జిఎంఆర్  వరలక్ష్మి క్యాంపస్‌, విశాఖపట్నం వారు వివరించారు : “దీపావళి వేడుకను కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటిస్తూ  పండుగను సురక్షితంగా, సంతోషంగా జరుపుకో వచ్చు అన్నారు. కంటికి గాయం అయితే కంటిని సున్నితంగా శుభ్రం చేయాలి: కంటిలో ఏదైనా ధూళి, చిన్న వస్తువు లేదా ఇతర పదార్థాలు పడితే శుభ్రమైన నీటితో లేదా సలైన్ ద్రావణంతో మెల్లగా కడగాలి సూచించారు. ఎల్‌.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్, విశాఖపట్నం: అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు 7095031666,9396712020,9346132020 సంప్రదించవలెను.