స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు కు ఎమ్మెల్యే బేబి నాయన శుభాకాంక్షలు
బొబ్బిలి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఎమ్మెల్యేల బేబి నాయన శుభాకాంక్షలు తెలిపారురాష్ట్రంలో ఇటీవల జరిగిన పట్టణ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది.. బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో పట్టణం మరియు నాలుగు మండలాలలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.. ఈ సందర్భంగా సోమవారం బొబ్బిలి కోటలో గౌరవ శాసనసభ్యులు ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు (బేబీ నాయన), బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు ని అభ్యర్థులంతా తమ బంధు మిత్రులతో వచ్చి కలిసి, వారి గెలుపుకు సహకరించినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మరియు లక్ష్మునాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించాలని, తమ పరిధిలో ఉన్న సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పట్టణం మరియు గ్రామాలలో మౌళిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. అలాగే రానున్న పంచాయితీ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో విజయం సాధించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు.