BREAKING
మేడ్చల్‌లో విద్యుత్ భద్రతా నిబంధనలకు తూట్లు.. ఎల్‌సీ లేకుండానే ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ప్రైవేట్ సిబ్బంది ప్రజా సమస్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక దృష్టి 2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకు తాగునీటి కనెక్షన్! నకిలీ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలపై చర్యలు తీసుకోవాలి ఢిల్లీ అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటో కేసు ప్రేమించిన వ్యక్తి మరణం తట్టుకోలేక... యువతి ఆత్మహత్య విద్యుత్ స్తంభాలే ప్రమాదం ఘటికలు స్థల వివాదంపై కలెక్టర్‌కు ఫిర్యాదు SIR ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి గోవాలో షూటింగ్ చేస్తుండగా హీరో విశాల్‌కు తీవ్ర గాయం భగత్ సింగ్ జీవితం స్ఫూర్తిదాయకం మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువత ప్రతిజ్ఞ ఎల్లంపేట్ బీజేపీ నేతలకు జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు పిట్టగూడలో పాడైన బోర్‌వెల్‌.. తాగునీటికి ఇబ్బందులు ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

సోమిరెడ్డి అవినీతిని అడ్డుకుంటున్న తెలుగు తమ్ముళ్లు"

Select Suryaa Now
సోమిరెడ్డి అవినీతిని అడ్డుకుంటున్న తెలుగు తమ్ముళ్లు"

సోమిరెడ్డి అవినీతిని అడ్డుకుంటున్న తెలుగు తమ్ముళ్లు"

 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి అవినీతి, ఆగడాలు మితిమీరిపోవడంతో  తిరగబడుతున్న సొంత పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్లు

పొదలకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ లేఅవుట్ మరియు ఐటీఐ కళాశాలలకు అతి సమీపంలో గ్రావెల్ తవ్వి తరలిస్తున్న సోమిరెడ్డి ముఠా!

సోమిరెడ్డి ముఠా, ఆగడాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అడ్డుకున్న తెలుగుదేశం నేతలు

తమ గ్రామాలకు అతి సమీపంలో గ్రావెల్ తరలించి, ఈ ప్రాంతమంతా గుంతల మయమైతే  తాము, మరియు తమ పశువులు తిరగడానికి కూడా వీలుండదని, భవిష్యత్తులో గ్రామాలు వదిలి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు

ఎవరు ఏమనుకున్నా, తన అధికార బలాన్ని ఉపయోగించి, గోరంత అనుమతులతో కొండలను తవ్వేస్తున్న సోమిరెడ్డి బ్యాచ్‌ను చూసి, విస్తుపోతున్న ప్రజలు

"అధికారం మనదే, దోచేద్దాం" అన్నట్టుగా సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు, సోమిరెడ్డి అల్లుడు, కూటమిగా ఏర్పడి, సర్వేపల్లిని సమస్తం దోచుకోవడాన్ని జీర్ణించుకోలేక, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న సర్వేపల్లి జనం

సోమిరెడ్డి ధనదాహానికి తమ గ్రామాల ఉనికే కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని, సోమిరెడ్డి ధన దాహానికి హద్దు, అదుపు లేకుండా పోయిందని, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక మహిళలు, రైతులు

జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి దృష్టి పెట్టాలని, ఒకవేళ అనుమతులు ఇచ్చి ఉంటే వాటిని వెంటనే రద్దు చేయాలని, సోమిరెడ్డి బారి నుంచి తమను కాపాడాలని ముక్తకంఠంతో వేడుకుంటున్న అన్ని పార్టీలకు చెందిన నేతలు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు