BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

సంతపేటలో పోలీసుల విస్తృత తనిఖీలు

Select Suryaa Now
సంతపేటలో పోలీసుల విస్తృత తనిఖీలు

నెల్లూరు, అర్బన్/క్రైమ్ (మేజర్ న్యూస్);
నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల,ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుక్కలగుంట మహాలక్ష్మి గుడి ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సంతపేట సబ్‌ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో 28 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రాంతంలోని సుమారు 100 ఇళ్లను తనిఖీ చేసి, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.వాటి రిజిస్ట్రేషన్, యాజమాన్య వివరాలు, ఇతర అవసరమైన పత్రాలను పరిశీలించేందుకు వాహనాలను పోలీసుల ఆధీనంలో ఉంచారు.పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నారు.జిల్లాలో నేరాల నివారణతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచేందుకు ఇటువంటి ప్రత్యేక తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని పోలీసు శాఖ స్పష్టం చేసింది. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇతర అవసరమైన పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించింది. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.