BREAKING
అమిత్ షా పాదయాత్రలో పాల్గొన్న సైదాబాద్ మాజీ కార్పొరేటర్ అరుణ రవీందర్ రెడ్డి గల్ఫ్ దేశాల్లో మళ్లీ మొదలైన యుద్ధ భయాలు వ్యవసాయ రంగానికి సంక్షోభ సహాయాలకే ప్రభుత్వాల పెద్దపీట విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో గిరిజనుడికి తీవ్ర గాయాలు అమిత్ షా కార్యక్రమానికి సరస్వతి నగర్ డివిజన్ నుంచి బయలుదేరిన నాయకులు ప్రజావాణికి 56 దరఖాస్తులు - త్వరితగతిన పరిష్కరించాలి - కలెక్టర్ కుమార్ దీపక్ రైలు తయారీ దిగ్గజం అల్స్టోమ్‌కు భారీ ఎదురుదెబ్బ ఏఐ రంగంలో హెచ్చుతగ్గులు మరియు యూఎస్ టెక్ స్టాక్స్ ట్రెండ్ నవంబర్ 20న థియేటర్లలోకి ‘డానీ’: ఇది ఒక కల్ట్, వైల్డ్ డ్రామా అంటున్న హీరో ఆశిష్ గాంధీ! డబల్ బెడ్ రూమ్ ఇళ్లపై త్వరితగతిన సమగ్ర విచారణ చేపట్టాలి రాష్ట్రస్థాయి కోకో పోటీలకు వేపులపర్తి విద్యార్ధి ఎంపిక. బెజ్జుర్ సోసైటీలో అవకతవకలపై ప్రజావాణి లో పిర్యాదు అమెరికా మధ్యకాలపు ఎన్నికల్లో సంప్రదాయాన్ని బద్దలు కొట్టిన ట్రంప్ న్యాయ శాఖ జోక్యం గ్రామపంచాయతీ స్థలం కాపాడాలని ఫిర్యాదు స్నేహితుని అండగా మేమున్నాం 2005 పదో తరగతి బ్యాచ్- కేబుల్ ప్రసాద్ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం.. మాధురి కుమార్తె గుండె శస్త్రచికిత్సకు రూ.5,700 కేటాయింపు

సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ మంజుప్రియ వెంకటేష్ ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ మంజుప్రియ వెంకటేష్ ఎన్నికల ప్రచారం

 

గుడిపల్లి మేజర్ న్యూస్: మండలంలోని కుప్పిగానిపల్లి, పీబీ వాడ ఎంపీటీసీ సెగ్మెంట్ల పరిధిలో జడ్పీటీసీ అభ్యర్థి మంజుప్రియ వెంకటేష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను, గ్రామ పెద్దలను, మహిళలను, యువతను ఆప్యాయంగా కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా పేద కుటుంబాల సంక్షేమం, మహిళల అభ్యున్నతి, రైతులకు అండగా నిలిచే కార్యక్రమాలు, యువతకు ఉపాధి అవకాశాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యతను వివరించారు.

ఈ సందర్భంగా మంజుప్రియ వెంకటేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, గ్రామాల్లో తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వారి పక్షాన నిలబడి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

జడ్పీటీసీగా అవకాశం కల్పిస్తే గుడిపల్లి మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు, ఆశీర్వాదం కోరుతూ ప్రచారాన్ని కొనసాగించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మహిళా కార్యకర్తలు, యువకులు, స్థానిక నాయకులు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

రిపోర్టర్ :-లెనిన్ బాబు గుడిపల్లి మండలం సూర్య