BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Select Suryaa Now
శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

నెల్లూరు, కల్చరల్ (మేజర్ న్యూస్):
నగరంలోని శ్రీకన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించడంతోపాటు ప్రధాన వీధుల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు భక్తులను ఆకట్టుకునేలా ముస్తాబు కాగా, ఉత్సవాల నిర్వహణను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దసరా ఉత్సవ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు.ఉత్సవాల తొలిరోజు శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నుంచి 1008 మంది మహిళలు కలశాలతో ఊరేగింపుగా బయలుదేరి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం మండపారాధన, కలశ స్థాపన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారికి సహస్రనామార్చనతో పాటు కుంకుమ పూజ నిర్వహించారు. శ్రీ పీఠం గురువులు, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రధాన అర్చకులు లలిత శివకుమార్ స్వామి ఆధ్వర్యంలో కలశ స్థాపన, అమ్మవారికి భవాని అలంకరణ కార్యక్రమాలు జరిగాయి. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోట గురుబ్రహ్మం, గౌరవ అధ్యక్షుడు కొండ ప్రవీణ్ శంకర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు శేగు షణ్ముగరావు, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కోశాధికారి జనార్దన్ రావు, ఉపాధ్యక్షుడు వేముల ప్రసాద్, సంయుక్త కార్యదర్శి మునగ వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారు ఆంజనేయులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభంతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.