BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

శ్రీచౌడేశ్వరి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు

Select Suryaa Now
శ్రీచౌడేశ్వరి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు


- పసుపు అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
- ప్రత్యేక ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ
మదనపల్లె,మేజర్ న్యూస్ : పట్టణంలోని నీరుగట్టువారిపల్లె నందు వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో దసరా (శరన్నవరాత్రి) ఉత్సవాలు,30వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.ఇందులో భాగంగా తొలిరోజు శ్రీ చౌడేశ్వరి అమ్మవారు పసుపు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పంచామృతాభిషేకము,తీర్థప్రసాద వినియోగము,అమ్మవారికి ప్రత్యేక అలంకరణ,మహా మంగళహారతిని భక్తిశ్రద్దల నడుమ నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయ కమిటీ అధ్యక్షులు పురాణం చంద్రశేఖర్,కమిటీ గౌరవ అధ్యక్షులు రామిశెట్టి నీలకంఠ,గౌరవ ఉపాధ్యక్షులతోపాటు కోశాధికారి రామిశెట్టి రత్నమయ్య,కార్యదర్శి పవన్ కుమార్ మరియు పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ ఈ ఏడాది అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశామన్నారు.విద్యుత్ దీపాలు,అనేక రకాల పుష్పాలతో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించడం జరిగిందన్నారు.11వ తేదీ నుండి 20వ తేదీ వరకు 10 రోజులపాటు దసరా ఉత్సవాలు జరుగుతాయన్నారు.11వ తేది పసుపు,12వ తేదీ కుంకుమ,13వ తేదీ వెండి కవచం,14వ తేదీ అన్నపూర్ణ దేవి,15వ తేదీ కనకదుర్గ 16వ తేదీ సంతాన లక్ష్మి,17వ తేదీ సరస్వతి దేవి,18వ తేదీ మహిషాసుర మర్ధిని,19వ తేదీ ధనలక్ష్మి 20వ తేదీ రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తారన్నారు.దాతల సహకారంతో ప్రతిరోజు భక్తులకు అల్పాహారం అందజేయడం జరుగుతుందన్నారు.శ్రీ చౌడేశ్వరి దేవి ఆశీస్సులతో ప్రజలంతా  ఆయురారోగ్యాలు,అష్టైశ్వర్యాలు పొందాలని ఆకాంక్షించారు.అదేవిధంగా భక్తులు నవరాత్రి ఉత్సవాలకు పెద్దఎత్తున తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,తొగటవీర క్షత్రియ కుల బాంధవులు,భక్తులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లె నియోజకవర్గం ఇంచార్జి