andhrapradesh
శ్రీ కంచి కామాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు
అవనిగడ్డ, మేజర్ న్యూస్ దసరా ఉత్సవాల్లో భాగంగా స్థానిక ఆరవ వార్డులో కొలువై ఉన్న శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీ కంచి కామాక్షి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉమ్మడి సింగు ఉదయ నాగేంద్ర చారి అర్చకత్వంలో ఉదయం కలశ స్థాపన చేసి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కాశి వీర బసవ శర్మ–శివకుమారి, పాకలపాటి నాంచారయ్య–శ్రీలక్ష్మి, కాశి సురేంద్ర కుమార్–ప్రమీలరాణి, కాశి వెంకట కోటేశ్వరరావు–గాయత్రి దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు కావలసిన ఏర్పాట్లను ఆలయ కమిటీ పర్యవేక్షించింది.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.