BREAKING
నర్సీపట్నం గ్రంథాలయానికి రూ.35 వేల విలువైన 50 పుస్తకాల అందజేత బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. తేగాడలో ఎన్నికల అవగాహన. అనకాపల్లిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. నాన్న రాక కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు పిడుగు లాంటి వార్త గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత సుసరాం సర్పంచ్ ను అభినందించిన కృష్ణ చైతన్య... ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం సరికాదు సైకిల్ గుర్తుకి ఓటు వేయండి శ్రీకాకుళం స్వర్ణయుగానికి నాంది పలికిన రెండున్నరేళ్ల కూటమి పాలన

శివపార్వతులను పల్లకిలో ఊరేగించిన భక్తులు.

Select Suryaa Now
శివపార్వతులను పల్లకిలో ఊరేగించిన భక్తులు.

 

ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో నేత్రపర్వంగా కార్తీక జ్వాలాదీప కార్యక్రమం.

పలాస, నవంబర్ 24,మేజర్ న్యూస్.

కార్తీక పౌర్ణమి సందర్భంగా పలాస రైల్వే కాలనీలో గల ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కార్తీక జ్వాలాదీప కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.జిల్లాలో ఎన్నడూ లేని విధంగా జ్వాలాదీపాన్ని వెలిగించడం విశేషం. మంగళవారం కార్తీక పౌర్ణమి కావడంతో రాత్రి 7 గంటల నుంచి ఈ కార్యక్రమం జరిగింది.ముందుగా శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకిపై పెట్టి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఔరు గడ్డి తో పాటు ఖద్దరు వస్త్రాలతో తయారు చేసిన వత్తులను పేర్చి శాస్త్రోక్తంగా జ్వాలను వెలిగించారు.పైన జ్వాలలు వెలుగుతుండగా కింద భాగం నుంచి స్వామివారి పల్లకిని ఊరేగింపు నిర్వహించారు.స్వామివారికి ఎంతో ప్రీతియైన జ్వాలాదీపోత్సవాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ నిర్వహణ కమిటీ గట్టి జాగ్రత్తలు తీసుకుంది. గంటపాటు ఈ కార్యక్రమం నిర్వహించగా శివనామస్మరణతో భక్తులు జోగారు.