సీఎం సహాయనిధి చెక్కు అందజేత.......
వరికుంటపాడు, మేజర్ న్యూస్ : మండలంలోని విరువూరు పంచాయతీ కోటవర్ధనపల్లికి చెందిన పిట్టల రాంబాబుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.63,734 మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు స్థానిక టిడిపి నాయకులు ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఆపద సమయంలో ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సహాయనిధి ద్వారా అందిన సాయం తమకు ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విరువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.