సత్యసాయి సేవా సమితిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
ఆమదాలవలస,
ఆమదాలవలస పట్టణ పరిధి మెట్టెక్కివలస సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సేవా సమితి కన్వీనర్ కన్నేపల్లి వెంకట కామ అవధానులు, విద్యా విభాగం సమన్వయకర్త
ఆకెళ్ళ రామలక్ష్మి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఆదివారం నుండి ప్రారంభం అయ్యాయి.
ఆదివారం మొదటి రోజు బాల త్రిపుర సుందరి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. పట్టణ పురోహితులు బలివాడ చిట్టి పంతులు ఆధ్వర్యంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు భక్తులు నిర్వహిస్తున్నారు. అమ్మవారి విగ్రహాన్ని కొప్పుల యోగేశ్వర పట్నాయక్ దంపతుల వారిచే ప్రతిష్టించి సత్యసాయి మందిరంలో పూజ నిర్వహిస్తున్నారు.