BREAKING
కొత్త లగ్జరీ కారు కొన్న 'ప్రేమలు' హీరో నస్లెన్.. ధర ఎన్ని కోట్లు అంటే! ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై అఖిలపక్ష నిరసన ర్యాలీ సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ పల్లె పండుగ 3.0తో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు! 132/33 kv నూతన sub- స్టేషన్ ప్రారంభం గురవరాజుపల్లి మినీ గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం... ఆరోగ్య భీమా కార్డుల పంపిణీ హైడ్రా-తో నగర చెరువులన్నీ సుందరవనాలు: భాగ్యనగరానికి సరికొత్త జల వైభవం కాశి కాలభైరవ స్వామివారిని దర్శించుకుంటున్న ఎమ్మెల్సీ త్రిమూర్తులు శ్రీ విష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే? వైఎస్సార్ విగ్రహం వద్ద ఆక్రమణలు తొలగింపు పండగలు లేదా వరుస సెలవులు వస్తే హైదరాబాద్ రోడ్లన్నీ పూర్తిగా ఖాళీ శివలింగ ని తాకిన సూర్యకిరణాలు. నిన్న మెడికవర్ హైవే సమీపంలో పాస్‌ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన... ప్రభాకర్ చౌదరికి టీడీపీ నాయకుల జన్మదిన శుభాకాంక్షలు కేక్ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు యువత నాయకులు

సర్ ప్రక్రియపై చుర్రుమన్న వామపక్షాలు:

Select Suryaa Now
సర్ ప్రక్రియపై చుర్రుమన్న వామపక్షాలు:

 జీలుగుమిల్లి సూర్య న్యూస్:  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై సీ ఈ సీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని జీలుగుమిల్లి లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఇండియా కూటమి పార్టీలైన  సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. భారతదేశంలో సుమారు 13 కోట్ల ఓట్లను తొలగించిన కేంద్ర ప్రభుత్వం తీరును వారు ఖండించారు. ఆర్టికల్ 326 ప్రకారం ఓటు తొలగించే హక్కు ఎవరికీ లేదని వారు సూచించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సర్ ప్రక్రియపై  ఆందోళనను జరుగుతున్నాయన్నారు. ఓట్లు తొలగించి అక్రమ పద్ధతిలో గద్దెనెక్కుతున్నారని వారు ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతంలో పోలవరం నిర్వాసితుల పేరుతో అనేక మంది గిరిజనుల ఓట్లు తొలగించారని వారు వెల్లడించారు. నిరసన చేస్తున్న వారిపై అక్రమ అరెస్టులను ఖండించారు. దేశ ప్రజలు చేస్తున్న నిరసనలను గౌరవించి సి ఈ సి జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కారం దారయ్య, గిరిజన సంఘం నాయకులు తెల్లం దుర్గారావు, కొప్పుల నాగరాజు, దాసరి రామారావు, కాంగ్రెస్ నాయకులు కుంజా కుమారి, తుర్లపాటి రాణి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 రిపోర్టర్ బొంతు రామకృష్ణ జీలుగుమిల్లి ఏలూరు జిల్లా