BREAKING
పెద్దపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి ఎనిమిది మంది అరెస్టు.. రూ.18,300 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం టాలీవుడ్ స్టార్ హీరోలపై కోన వెంకట్ సంచలన వ్యాఖ్యలు.. పాన్ ఇండియా అంటూ టైమ్ వేస్ట్ చేస్తున్నారంటూ విమర్శలు! పువ్వుల జాతర షురూ.. సుఖ సంతోషాలతో ఐక్యమత్యంగా పండుగలను జరుపుకోవాలి కేవలం రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల వసూళ్లు: బాక్సాఫీస్ వద్ద కన్నడ చిత్రం 'ప్రేమద ఊరాలి' సంచలనం! పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వ్యాసరచన, లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీ పోటీలు గ్రామ గ్రామాన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ నవదుర్గల వేషధారణతో భాష్యం చిన్నారుల సందడి ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు అల్ఫోర్స్‌ విద్యాసంస్థల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మహాశక్తిలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సురక్షితమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల పరిశీలన.. ఎస్వీసీఈలో ఘనంగా ఫ్రెషర్స్ డే తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కళాశాలలో నూతనంగా అడుగుపెట్టిన ప్రథమ సంవత్సర విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, సీనియర్ విద్యార్థులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాశాల ఛ దుర్గాదేవి నవరాత్రులకు రూ.5 వేల విరాళం

సమ్మె విరమించి వైద్య సేవలు అందించండి.. కాంట్రాక్ట్ ఉద్యోగులను కోరిన ఐ టి డి ఏ పి ఓ రాములు నాయక్.. ప్రభుత్వం హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామన్న ఉద్యోగులు..

Select Suryaa Now
సమ్మె విరమించి వైద్య సేవలు అందించండి.. కాంట్రాక్ట్ ఉద్యోగులను కోరిన  ఐ టి డి ఏ పి ఓ రాములు నాయక్.. ప్రభుత్వం హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామన్న ఉద్యోగులు..

బుట్టాయిగూడెం : మేజర్ న్యూస్: మెడికల్ అండ్ హెల్త్, కాంట్రాక్ట్  ఉద్యోగులు సమ్మె విరమించి  మారుమూల ప్రాంతంలోని  గిరిజన ప్రజలకు  వైద్యం అందించాలని   ఐటీడీఏ పీవో  కే రాములు నాయక్ కోరారు.     మండలంలోని కోటరామచంద్రపురం ఐటీడీఏ వద్ద  వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల శాంతియుత నిరసన ఐదవ రోజు  శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు సున్నం శ్రీరాములు,  ఆదివాసీ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ పూసం వెంకటేశ్వరావు, వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చవలం దుర్గ ప్రసాద్ లు మాట్లాడుతూ  వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సర్వీసును  తక్షణమే క్రమ బద్దీకరించాలని   ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సేవలను క్రమబద్ధీకరించే వరకు  రెగ్యులర్ ఉద్యోగులతో సమాన వేతనం  చెల్లించాలని కోరారు. వ్యాధులు అందరికీ వస్తాయని,  మేము   వైద్య ఆరోగ్యశాఖలో  పనిచేస్తున్నామని వచ్చే వ్యాధులకు  తెలియదని  మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి కాంట్రాక్టు ఉద్యోగికి  ఈఎస్ఐ కార్డు మంజూరు చేయాలని  కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు  సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.  ఐటీడీఏ పీవో  కే రాములు నాయక్  దీక్షా శిబిరానికి చేరుకుని మారుమూల ప్రాంతంలో నివసించే ప్రజలకు  వైద్య సేవలు అందించాలని  సమ్మె విరమించాలని కోరారు.  తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు  సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు.  వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెకు ప్రగతిశీల యువజన సంఘం నాయకులు   భాష శ్యాం బాబు, తగరం బాబురావు, బన్నే వినోద్ లు ఆదివాసి కొండ రెడ్డి సంఘం, రెగ్యులర్ ఉద్యోగస్తులు   సంఘీభావo తెలిపారు. తెలియజేశారు. ఈ కార్యక్రమం లో  వంగా శ్రీను, కె.ముత్యాలమ్మ, పోశమ్మ స్టాఫ్ నర్స్, ఫార్మసీ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, హెల్త్ అసిస్టెంట్,  రేడియా గ్రాఫి మరియు ఏఎన్ఎం పాల్గొన్నారు.

 రిపోర్టర్ నాని బుట్టాయిగూడెం ఏలూరు జిల్లా