సమస్యలు పరిష్కారమునకు పోస్ట్ కార్డు ఉద్యమం
ఇరగవరం మేజర్ న్యూస్ :కాలనీ సమస్యలు పరిష్కారమునకు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టినట్లు ప్రజా సంఘాల నాయకుడు కామన మునిస్వామి తెలిపారు.కార్యక్రమంలో మాట్లాడుతూ ఇరగవరం గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూలు సమీపంలో గల ప్రభుత్వ కాలనీలో కనీస సౌకర్యాలు రోడ్లు డ్రైనేజీలు,మంచినీళ్లు సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాటిని పరిష్కరించాలని అక్కడి ప్రజలు ప్రభుత్వం దృష్టికి అనేక పర్యాయాలు విన్నవించుకున్న పరిష్కరించలేదని విమర్శించారు. ఇక్కడి ప్రజలు కాలనీ సమస్యలు పరిష్కారం కోసం వీధి పోరాటాలు ప్రారంభించారని తెలిపారు. తమ సమస్యను పరిష్కారం కోసం నిర్వహిస్తున్నారని రోడ్ల నిర్మాణం కోసం చేశారు. దీనిలో భాగంగానే పోస్ట్ కార్డు ఉద్యమం భుజింగా జిల్లా కలెక్టర్కు సమస్యలను కార్డు ద్వారా తెలియజేస్తూ ప్రతి ఇంట్లోని కార్డు ద్వారా సమస్యలను కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్తున్నారన్నారు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలన్నా,వృద్ధులు ఆసుపత్రికి వెళ్లాలన్న ప్రజలు నిత్యం జీవన విధానాన్ని కొనసాగించేందుకు వెళ్లాలన్న ,పనులకు వెళ్లాలన్న రోడ్డు మార్గం సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిష్కారం అయ్యేవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.ఝాన్సీ లక్ష్మి,మంగిన చంద్రావతి, వీరవల్లి సరస్వతి, దొంగ శివ వానపల్లి మాధవి, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ దొరబాబు ఇరగవరం పశ్చిమగోదావరి జిల్లా,