BREAKING
సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు వన సమారాధనలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత కార్తీక వన సమారాధనలో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కార్తీక మాస పూజలు ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ మేయర్, డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారం.. ట్రాఫిక్ ఆంక్షలు రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లకు పోలీసుల కౌన్సెలింగ్

సహజ ప్రసవాన్ని ప్రోత్సహిద్దాం – తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుదాం

Select Suryaa Now
సహజ ప్రసవాన్ని ప్రోత్సహిద్దాం – తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుదాం

విజయవాడ, మేజర్ న్యూస్: సహజ ప్రసవం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తొలి అడుగు అని ఏపీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోన్–II అధ్యక్షుడు యం. రాజుబాబు అన్నారు. సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్ ఇండియా పిలుపు మేరకు ఆదివారం విజయవాడలోని ఏలూరు రోడ్డు, రామవరప్పాడు రింగ్ సెంటర్ వద్ద ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్. నాగ శేషమ్మ అధ్యక్షతన సహజ ప్రసవాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన వాక్‌థాన్‌ను రాజుబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లి ఆరోగ్యం కుటుంబానికి, కుటుంబ ఆరోగ్యం సమాజానికి పునాది అని, గర్భిణులకు పోషకాహారం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు, మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని పేర్కొన్నారు. సహజ ప్రసవాలపై ప్రతి ఇంట్లో అవగాహన కల్పించాలని, ఈ సందేశాన్ని గ్రామాలు, పట్టణాలకు తీసుకెళ్లడంలో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ ఎస్. నాగ శేషమ్మ మాట్లాడుతూ, సహజ ప్రసవాలను ప్రోత్సహించడం, అనవసరమైన సిజేరియన్‌లను తగ్గించడం, మిడ్‌వైవ్స్ సేవల ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ వాక్‌థాన్ ముఖ్య ఉద్దేశమన్నారు. తల్లి లేదా బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదం ఉన్నప్పుడు సిజేరియన్ అవసరమని, అయితే వైద్యపరమైన అవసరం లేకుండా మంచి రోజు, సమయం, నక్షత్రం కోసం సిజేరియన్ చేయించుకోవడం సరికాదని, ప్రసవ విధానంపై వైద్యుల సలహా మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, పిన్నమనేని సిద్ధార్థ నర్సింగ్ కళాశాల విద్యార్థులు, బీసీ, ఎస్సీ హాస్టల్ విద్యార్థులు, కె. భారతి, కె.వి.వి. నాగమురళి, ఉమా మహేశ్వరి, మాధవి, సీతా మహాలక్ష్మి, విజయకుమారి, కల్పన, ఎ. ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.