సాసుపల్లి కృష్ణబాబు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య
నరసన్నపేట అక్టోబర్ 28 మేజర్ న్యూస్:నరసన్నపేట పట్టణంలోని గాంధీనగర్-1లో సాసుపల్లి కృష్ణబాబు గారి మాతృమూర్తి ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య గారు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాతృమూర్తి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ పరామర్శ కార్యక్రమంలో రాష్ట్ర కాలింగ విభాగం అధ్యక్షులు ఆరంగి మురళీధర్, రాష్ట్ర కార్యదర్శి బంకుపల్లి లోకనాథం శర్మ, రఘుపాత్రుని శ్రీధర్, మండల యూత్ అధ్యక్షులు బుద్దల రాజశేఖర్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రమణ సాహు, మండల ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పెద్దిరెడ్ల రాము, మండల ఉపాధ్యక్షులు నేతింటి రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు పొట్నూరు సాయి ప్రసాద్, మాజీ ఎంపీటీసీ మార్పు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.