BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

రూ 3.5 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

Select Suryaa Now
రూ 3.5 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

 

ఆత్రేయపురం మేజర్ న్యూస్ కోట్లాది రూపాయలతో గ్రామాలలో సీసీ రోడ్లు వేసి గ్రామాలను అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ. 3.50 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీ భవనం వంటి పలు అభివృద్ధి పనులను వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు సొసైటీ అధ్యక్షులు ముదునూరి రాంబద్ర రాజు తో కలిసి  ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో రోడ్లు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని బురద రోడ్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  సహకారంతో గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు ఆత్రేయపురం గ్రామంలో రూ. 3.50 కోట్లతో అభివృద్ధి పనులుప్రారంభించామని ఇందులో వీధుల్లో సీసీ రోడ్లు, పక్కా డ్రైనేజీ వ్యవస్థ, చిన్నారుల కోసం నూతన అంగన్వాడీ భవనాన్ని నిర్మించామన్నారు.అలాగే కస్టమ్ హైరింగ్ సెంటర్ (సి హెచ్ సి) రైతులకు అందుబాటు ధరలో వాడుకునే విధంగా ట్రాక్టర్ ను మరియు వ్యవసాయ పరికరాలను ప్రారంభించారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు ఏ గ్రామం వెళ్ళిన సంక్షేమ పథంలో నడుస్తున్నాయన్నారు వాడపల్లి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినందుకు వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు సొసైటీ అధ్యక్షులు ముదునూరి రాంబద్రి రాజులను అభినందించారు తమ కోర్కెలు తీర్చాలంటూ తాసిల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన నిరసన కార్యక్రమం 20 రోజులకు చేరుకుంది వీరిని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కలిసి సంఘీభావం తెలిపారు  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పివిఆర్ కే రాజు తాసిల్దార్ శ్రీరామచంద్రమూర్తి ఏఈ వీరభద్రరావు  ,ఆకుల రామకృష్ణ మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లి మంగాదేవి భీమరావు మండల టిడిపి అధ్యక్షులు కూసం పూడి రామకృష్ణంరాజు , జిల్లా ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షులు కరుటూరి నరసింహారావు రాష్ట్ర టి ఎన్ టి యు సి కార్యనిర్వహక కార్యదర్శి ,ముళ్ళపూడి భాస్కరరావు మండల తెలుగు యువత అధ్యక్షులు వెచ్చ అనిల్ కుమార్ మాజీ ఎంపీపీ పిఎస్ రాజు  నీటి సంఘం అధ్యక్షులు జోజవరపు హరిబాబు వాడపల్లి దేవస్థానం మాజీ చైర్మన్  తోటకూర సుబ్బరాజు  నాగిరెడ్డి సత్యనారాయణ నరాల శెట్టి వెంకన్న  కాయల జగన్నాధం తోట రజిని మజ్జి సూరిబాబు దండు రాంబాబు   కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు