BREAKING
వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ!

రాష్ట్ర ప్రజలందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు

Select Suryaa Now
రాష్ట్ర ప్రజలందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : 

దుష్టశక్తులపై దైవశక్తి, అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. నేటి నుంచి ప్రారంభమవుతున్న శరన్నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఆరాధించడం మన సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనది.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలి. అమ్మవారి కరుణాకటాక్షాలతో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా వర్ధిల్లాలి. ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలి. ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.రాష్ట్ర ప్రజలందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు.