BREAKING
సాయంత్రం కోర్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ బెదిరింపులకు భయపడొద్దు..! కొరికాన దంపతులు ఆధ్వర్యంలో జనసేన లో చేరిక అయ్యప్ప ల నిత్య అన్నదానానికి చేయూత డ్రగ్స్ రహిత సమాజం కోసం ఐక్యంగా కదులుదాం! పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షునిగా శెట్టి. అప్పలరాజు నియామకం పై హర్షం... ఎన్నికల సామాగ్రి పంపిణీ ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో రామ్ మోహన్ రావు నేడే రాజాం మున్సిపల్ పోరు....... నేడు సర్పంచ్ ఎన్నికలు.. ఎవరిని వరిస్తుందో ఆ పీఠం! మగ్గూరు గ్రామంలో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం ప్రారంభం గ్రామఅభివృద్ధికి పనిచేస్తా ఆశీర్వదించి ఓటెయ్యండి మేము కష్టపడి పైకి వచ్చాం.. అందుకే మా విజయాల గురించి గొప్పలు చెప్పుకోము: డాక్టర్ శ్రీరామ్ నేనే కొల్లాయి వలస సర్పంచ్ పీఠం వందనాలకు విజయం వరించే నా.. ప్రజాక్షేత్రంలో అడ్రస్ లేని వైసీపీ నామినేషన్ తిరస్కరణ పేరుతో సానుభూతి నాటకం డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలి

రాజాం ప్రగతికి ప్రజా మద్దతు కోరిన రాజ్యసభ సభ్యులు " చింతకాయల ",ఎమ్మెల్యే " కోండ్రు "

Select Suryaa Now
రాజాం ప్రగతికి ప్రజా మద్దతు కోరిన రాజ్యసభ సభ్యులు " చింతకాయల ",ఎమ్మెల్యే " కోండ్రు "

- చేసిన అభివృద్ధి సంక్షేమమే ప్రజాబలం
రాజాం,నవంబర్ 25,మేజర్ న్యూస్ :
రాజాం మండలం శ్యాంపురం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు,జిల్లా పరిశీలకులు చింతకాయల విజయకుమార్ బుధవారం రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం మున్సిపల్ ఎన్నికలపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.వార్డుల వారీగా ఎన్నికల ప్రచారం,ప్రజల స్పందన,అభ్యర్థుల పనితీరు,ఎన్నికల పరిస్థితులపై వివరాలు తెలుసుకుని కీలక సూచనలు చేశారు.అనంతరం మీడియాతో జిల్లా పరిశీలకులు విజయకుమార్, ఎమ్మెల్యే కోండ్రు మాట్లాడుతూ పట్టణంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలే కూటమికి ప్రజాబలమని,వాటిని ప్రజలు గుర్తించి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ చైర్మన్ అభ్యర్థి సౌజన్యలతతో పాటు 32 వార్డుల కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.రాజాం పట్టణ అభివృద్ధికి రూ.100 కోట్లకు పైగా అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు చేరువయ్యామని, ఈ ప్రగతి మరింత కొనసాగాలంటే మున్సిపాలిటీలో కూటమి పాలనకు ప్రజలు అవకాశం కల్పించాలని కోరారు.గత వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాజాం ప్రధాన రహదారి నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే పూర్తి చేసి పట్టణ ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయాన్ని అందించామని పేర్కొన్నారు. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి సదుపాయాల మెరుగుదలకు రూ.7.50 కోట్ల మేర నిధులు వెచ్చించినట్లు తెలిపారు. పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ద్వారా లబ్ధి పొందలేని పేదలకు సీఎం సహాయనిధి ద్వారా రూ.2.50 కోట్ల ఆర్థిక సహాయం అందించి వైద్య అవసరాల్లో అండగా నిలిచామన్నారు.రాజాం రింగ్ రోడ్డుతో పాటు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు లక్ష్యాలతో పట్టణ ప్రగతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని,ప్రజల ఆశలు,ఆకాంక్షలకు అనుగుణంగా రాజాం మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.