రాజకీయాలంటే పదవులే ప్రామాణికం కాదు:కిమిడి
చీపురుపల్లి మేజర్ న్యూస్: రాజకీయం అనేది పదవులతో మాత్రమే ముడిపడింది కాదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున పేర్కొన్నారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందిస్తున్న పాలనను ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారన్నారు. అందువలనే మొన్న జరిగిన అర్బన్ లోకల్ బాడీస్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 90 శాతం పైగా సీట్లు ఇచ్చారని పేర్కొన్నారు. కూటమి నాయకత్వాన్ని ప్రజలు చాలా గట్టిగా నమ్మారన్నారు. విజయనగరం జిల్లా మొత్తం గ్రామ పంచాయతీలో ఉన్న పెద్దలందరూ కూడా పంతాలు పట్టింపులు పక్కనపెట్టి గ్రామం యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించి అందరూ కూడా ఏకగ్రీవాల మీద దృష్టి సారించాలని, ఎందుకంటే గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, సమాజం బాగుంటుంది తద్వారా
గ్రామంలో మంచి వాతావరణం వచ్చి అభివృద్ధి అనేది బాగా జరుగుతుందన్నారు.
రాజకీయం అనేది పదవులతో మాత్రమే ముడిపడింది కాదని దానికి మెరకముడిదాం మండలం గాదెల మర్రివలస, గుర్ల మండలంలో పెనుబర్తిని ప్రామాణికంగా తీసుకోవాలన్నారు.