నేడు పంచాయతీ పోరు.. అభ్యర్థుల గుండెల్లో బేజారు
తె ర్లాం నవంబరు 25 మేజర్ న్యూస్ : నేడు పంచాయితీ పోరుకు సిద్ధమైన ఎన్నికల యంత్రాంగం.. ఆ ఎన్నికలు మాకొంప ఎక్కడ ముం చుతాయోన్నన్న అభ్యర్థులు గుండెల్లో బేజారు పరెడుగుతున్న కాలం ఆసన్నం..ఇక పంచాయితీ పోరుకు సిద్ధమైన యంత్రాంగం ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని పోలీసు యంత్రాంగాన్ని మండల పరిషత్ కార్యాలయం అధికార సిబ్బంది కోరడం చాలా ముఖ్యమైన అంశం. ఇక పోతే మండలంలో 33 పంచాయితీ గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో రెండు పంచాయితీలు ఒకటి చీకటి పేట మరొకటి సుందరాడ ఈ రెండు ఏకగ్రీవం కావడంతో ఎన్నికల అధికారి బృందానికి కొంత ఊరట లభించింది అని చెప్పాలి. మొత్తం 33 పోలింగ్ కేంద్రాల లకు గాను రెండు మినహా 31 పి.ఎస్.లకు 31 మంది అర్. ఓ.లు ఏ.అర్. ఓ లు 275 మంది.పి. ఓ.లు ఓ.పి.పి.లు అందరూ కలసి 800 మందికి పైగా ఎన్నికల సిబ్బందితో ఎన్నికలు నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని అర్. ఓ. హరికృష్ణ నాయుడు అన్నారు.
పోలీసు బందోబస్తు ముమ్మరం..సమస్యాత్మక గ్రామాలలో అదనపు బలగాలు మోహరింపు.
పంచాయితీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించామని స్థానిక ఎస్సై సాగర్ బాబు తెలిపారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కు ముగ్గురు నలుగురు పోలీసులు ప్రతీ పోలింగ్ కేంద్రాల కు ఒక్కొక్క ఎస్. ఐ లు 31 పోలింగ్ కేంద్రాల కుఉంటారని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ వారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇది కాకుండా మొబైల్ వాహనాలు సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలు మోహరింపు చేశామన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా