BREAKING
శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై చందానగర్ పోలీసుల అవగాహన నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ మూవీ: రెమ్యూనరేషన్‌పై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్*

పుర ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

Select Suryaa Now
పుర ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

 

 

 

 ఓటర్లు నిర్భయంగా ఓటును సద్వినియోగం చేసుకోండి

ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

 

చిత్తూరు ప్రతినిధి, మేజర్ న్యూస్ : జిల్లా లోని చిత్తూరునగర పాలక, పలు మున్సిపాలిటీలకు సంబంధించి మేయర్, చైర్మన్, కార్పోరేటర్ల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని, ఓటర్లు తమ ఓటును నిర్భయంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పేర్కొన్నారు. శనివారం నగరంలోని పివికేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 

పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన పోలింగ్ పరికరాల పంపిణీని పరిశీలించారు. అధికారులను మంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని, ఆయా ప్రదేశాలలో అదనపు భద్రతా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో ప్రిసైడింగ్ అధికారి, అదనపు ప్రిసైడింగ్ అధికారితో పాటు, ముగ్గురు ఇతర పోలింగ్ సిబ్బందిని, మైక్రో పరిశీలకులను నియమించామన్నారు. వీరికి పోలింగ్ ప్రక్రియపై ఇప్పటికే రెండు దఫాలుగా పోలింగ్ శిక్షణ అందించడం జరిగిందన్నారు. సంబంధిత ఎన్నికల సిబ్బందిని రూట్ అధికారుల ఆధ్వర్యంలో పోలింగ్ సామగ్రితో పాటు, వాహనాలలో ఆయా పోలింగ్ స్టేషన్లకు పంపడం జరిగిందన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాన్ని పోలింగ్ నిమిత్తం సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు నిర్దేశించిన సమయంలోగా పోలింగ్ కేంద్రానికి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

చిత్తూరు నగరపాలక పరిధిలో మేయర్, 9 కార్పొరేటర్ స్థానాలకు పోటీ 

 చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 60 డివిజన్లకు గాను 51 డివిజన్లు ఏకగ్రీవం కాగా... మిగిలిన 21, 22, 27, 31, 32, 42, 44, 46, 53 డివిజన్ల లో పోలింగ్ జరగనుంది. మేయర్ పదవికి ఆరుగురు పోటీలో ఉన్నారు. పోలింగ్ స్టేషన్ కు 200 మీటర్ల పరిధిలో అయిదుగురికి మించి జనం గుమికూడడం నిషేధించారు.చిత్తూరు నగర పరిధిలో 1,48,583 మంది ఓటర్లు ఉండగా, 175 పోలింగ్ కేంద్రాలు, 2, రూట్లు ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, ఆర్వో పుల్లారెడ్డి, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

ఉమాశంకర్ చిత్తూరు  స్టాఫ్ రిపోర్టర్.