BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్

Select Suryaa Now
ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్

 

-- పోలీసు బందోబస్తు నడుమ కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ

– జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి

శ్రీకాకుళం-మేజర్ న్యూస్ ప్రతినిధి:

    జిల్లాలోని 13 మండలాల్లో 342 గ్రామ పంచాయతీల పరిధిలో ఆదివారం జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసింది అని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి తెలిపారు.జిల్లాలోని 134 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అదనపు బలగాలను మోహరించాం. ఎచ్చెర్ల మండలంలోని ఇబ్రహీంబాద్, ఫరీదీపేట, కేశవరావుపేట, ఎస్.ఎం.పురం, పొందూరు దల్లిపేట, కంచరం , లోలుగు తదితర గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, క్యూ లైన్ల నిర్వహణ, జన సమూహాల నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పోలింగ్ ప్రక్రియను డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టాం.ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. లెక్కింపు, ఫలితాల ప్రకటన అనంతరం ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం.ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా కాల్చడం, బహిరంగ సంబరాలకు అనుమతి లేదని స్పష్టం చేశాం. గ్రామాల్లో పోలీసు సిబ్బంది నిరంతరం పర్యటిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎస్పీ  స్వయంగా పరిశీలించి, కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజలు సంయమనం పాటిస్తూ, ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.