ప్రజాప్రతినిధిగా ప్రజాక్షేత్రంలో తొలి అడుగు వేసిన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ షకీలా
ప్రజాప్రతినిధిగా ప్రజా క్షేత్రంలో తొలి అడుగు వేసిన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ షకీలా
--"మన పట్టణం -మనప్రగతి "కార్యక్రమంకు శ్రీకారం
--నిశితంగా సమస్యల అధ్యయనం
--ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారానికి హామీ
--ముస్తాపురం ప్రజా సమస్యలపై చైర్పర్సన్ డాక్టర్ షకీలాకు వినతులు
ఆత్మకూరు, సోమా వెంకటసుబ్బయ్య,మేజర్ న్యూస్ : ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ గా ఇటీవల ఘనవిజయం సాధించిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ప్రజాప్రతినిధిగా ప్రజాక్షేత్రంలో ఆదివారం తొలి అడుగువేశారు."మన పట్టణం -మనప్రగతి "అనే సరికొత్త కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు కు చెందిన టి. ముస్తాపురం గ్రామంలో, ఎస్ సి కాలనీ, టిడ్కో గృహ సముదాయం లలో డాక్టర్ షకీలా ముమ్మరంగా పర్యటించారు. ప్రజల సమస్యలను ఆమె తెలుసుకున్నారు. స్వయంగా సమస్యలను అధ్యయనం చేశారు.
ప్రజా సమస్యలను మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షకీలా నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన *‘మన పట్టణం – మన ప్రగతి’* కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ముస్తాపురం ప్రాంతంలో పర్యటించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ ప్రాంతంలో నెలకొన్న పలు సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులు, తాగునీటి సమస్య, అంగన్వాడీ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం, స్మశానవాటికకు సీసీ రోడ్డు ఏర్పాటు, టిడ్కో గృహాసముదాయం త్రాగునీటి సమస్య, బస్ షెల్టర్ ఏర్పాటు తదితర సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఆమెను కోరారు.ఈ సందర్బంగా డాక్టర్ షకీలా మాట్లాడుతూ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో తాను పోటీ చేశానని, తనకు అవకాశం కల్పించిన మంత్రికు, విజయం చేకూర్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా అన్ని వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటానని, మంత్రి రామ నారాయణ రెడ్డి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని డాక్టర్ షకీలా పేర్కొన్నారు.
ప్రజలు తెలిపిన సమస్యలను చైర్పర్సన్ డాక్టర్ షకీలా స్వయంగా విని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులతో మాట్లాడుతామని తెలిపారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వార్డుల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుంటున్నామని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె పేర్కొన్నారు.ఈ సందర్బంగా పలువురు డాక్టర్ షకీలాను శాలువాలు, పుష్ప గుచ్చాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తోగుంట స్వప్న, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.