ప్రభుత్వ ఆసుపత్రికి ఇన్వర్టర్ ను అందించిన ఆర్యవైశ్య మహిళా సంఘం
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు-అద్దేపల్లి ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో భట్టిప్రోలు ప్రభుత్వ వైద్యశాలకు రూ 10,200 ల విలువైన ఇన్వర్టర్ ను గురువారం ఆసుపత్రి ఇన్చార్జి డాక్టర్ సయ్యద్. మోహిసీనా తాజ్ కి అందజేశారు. అదేవిధంగా గత జూన్ నెల 2వ తేదీన వైద్యశాలకు వచ్చే రోగుల కొరకు రూ 20 వేల విలువ కలిగిన ఓపి బుక్స్, దుప్పట్లను గ్రామానికి చెందిన బుర్లె రాజేశ్వరి అందించారు. మరోదాత పఠాన్ అన్వర్ ఆలీ రూ 3 వేల విలువ గలిగిన టేకు కలపతో తయారుచేసిన బెంచి బల్లను వైద్యశాలకు అందించారని తెలిపారు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.ఆసుపత్రి సిబ్బంది బుర్లె కన్యకా, సంఘ సభ్యులకు ఆత్మీయ స్వాగతం పలికి వారి సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ పూల మొక్కలను అందజేశారు. ఇన్వర్టర్ స్వీకరించిన ఇన్చార్జ్ డాక్టర్ సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భట్టిప్రోలు అద్దేపల్లి ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు తూనుగుంట్ల నాగ సుధారాణి,ఎండూరి సూర్యప్రభ, బొమ్మిశెట్టి శ్రీవాణి, తూనుగుంట్ల లక్ష్మీపార్వతి, మాటూరు గృహలక్ష్మి, తూనుగుంట్ల హారిక, ఆలపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.